ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఏదొక సమయంలో చిన్నప్పటి ఫోటోలు రివీల్ చేస్తుంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో అడుగుపెడితే.. మరికొంతమంది డైరెక్ట్ హీరోయిన్ గానే కెరీర్ మొదలుపెడతారు. అయితే.. సినిమాల్లోకి వచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్లామర్ పరంగా అడుగులు వేస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి హిట్స్ అందుకొని నటన పరంగా మార్కులు సంపాదించుకున్న హీరోయిన్ అమలా పాల్. కేరళకు చెందిన ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మైనా(తెలుగులో ప్రేమఖైది) సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న అమలా.. తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
2009లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2011లో బెజవాడ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో.. 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హిట్ అందుకుని.. ఏకంగా రామ్ చరణ్ సరసన ‘నాయక్’ మూవీ ఛాన్స్ అందిపుచ్చుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’.. జెండాపై కపిరాజు లాంటి సినిమాలు చేసింది. కానీ.. తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదని చెప్పాలి. అందుకే.. తమిళ, మలయాళం సినిమాలపై దృష్టిపెట్టిన అమలా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ, హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి రచ్చ చేస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీకి సంబంధించి చైల్డ్ హుడ్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రెండు పిలకలు వేసుకొని స్కూల్ యూనిఫామ్ లో ఫ్రెండ్స్ తో నిలబడిన అమలా పిక్ తెగవైరల్ అవుతోంది. ఈ పిక్స్ లో అమలా పాల్ ని చూస్తూ ఫ్యాన్స్, నెటిజన్స్ ఎంతో క్యూట్ ఉందంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఈ బ్యూటీ మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో బికినీ పిక్స్ పెడుతూ సెగలు రేపుతోంది. ఇటీవల వెబ్ సిరీస్ లలో కూడా మెరుస్తున్న అమలా.. కుడి ఎడమైతే, రంజిష్ హై సహి, విక్టిమ్ హూ ఈజ్ నెక్స్ట్ లాంటి సిరీస్ లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అమల చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మరి అమల చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.