ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ ఒక స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలో మగరాయుడు అన్న పేరు ఉంది. పైకి చూడ్డానికి అమ్మాయిలా అందంగా ఉన్న.. క్యారెక్టర్ పరంగా టామ్ బాయ్ లా బిహేవ్ చేస్తుంది. కొంచెం ర్యాష్ గా.. కొంచెం రూడ్ గా ఉంటుంది. ధైర్యం ఎక్కువే మళ్ళీ ఈ బ్యూటీకి. అల్లరి పిల్ల, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అన్నట్టు నవ్వితే బుగ్గలు సొట్ట పడతాయండోయ్. సొట్ట బుగ్గల సుందరిగా ఇండస్ట్రీలో పేరుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మొదటి సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. మొదటి సినిమాతోనే తన నడుము ఒంపుల్లో యువ హృదయాలను గింగిరాలు పెట్టించింది. మంచు మనోజ్, మంచు విష్ణు, ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్ వంటి బడా హీరోల సరసన నటించింది.
తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటించింది. ఆమె మరెవరో కాదు సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను. ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో బబ్లీ నటనతో అందరినీ ఆకట్టుకుంది. వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, సాహసం వంటి సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సీ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆరంభం, కాంచన 2 వంటి సినిమాల్లో నటించగా.. హిందీలో చష్మే బద్దూర్, బేబీ, పింక్ వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
వెండితెర మీదే కాకుండా ఓటీటీ వేదికగా కూడా తాప్సీ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అలా ప్రయోగాలు చేసిన వాటిలో ఆమె నటించిన బ్లర్ సినిమా ఒకటి. ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ సినిమా జీ5లో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమె తన కెరీర్ లో తన నటనకు గాను పలు అవార్డులను కూడా గెలుచుకుంది. తాప్సీ కెరీర్ లో సాలిడ్ హిట్ అంటూ ఏమీ లేదు. అయినా గానీ వరుస సినీ అవకాశాలతో మాత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం తమిళంలో రెండు, బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ ఢిల్లీ బ్యూటీ. ఎవరో విసిరేసిన పిక్కు, త్రో బ్యాక్ పిక్ అంటూ తాప్సీ చైల్డ్ హుడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కానీ తాప్సీ పన్ను ఇప్పుడు ఎంత క్యూట్ గా ఉందో.. చిన్నప్పుడు కూడా అంతే క్యూట్ గా ఉంది.