టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల స్టైలే వేరు. ఆయన తెరకెక్కించే సినిమాల్లోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అవే సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్తాయి. అయితే రానా దగ్గుపాటి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ లీడర్. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ములకు, హీరోగా రానాకు మంచి విజయాన్ని అందించింది. ఇక అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా లీడర్ 2 తెరకెక్కించాలని ఈ దర్శకుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట.
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ!
దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసిన శేఖర్ రానాకు వినిపించినట్లు సమాచారం. కానీ దీనికి ఎందుకో రానా నిరాకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రానా కాకుండా ఈ మూవీలో హీరోగా ఎవరు కనిపిస్తారా అనే ప్రశ్నకు తాజాగా మరో హీరో పేరు తెర మీదకు వచ్చింది. తాజా సమచారం ప్రకారం లీడర్-2లో హీరో సూర్య నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. లీడర్-2లో సూర్య అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.