సినిమా పరిశ్రమలో కానీ మరే ఇతర రంగాల్లో కానీ పాపులారిటీ పొందిన వ్యక్తులు వెనకాల బలిష్టమైన వ్యక్తులు కనిపిస్తు ఉంటారు. ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల వెనకాల ఉంటూ వారికి అంగ రక్షకుడిగా ఉంటారు. వారినే అందరు బాడీగార్డ్స్ అంటారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా..వీరికి నెలకు, ఏడాదికి జీతం ఎంతుంటుందనేదే ఎవరికీ అంతు చిక్కని సమాధానం.
ప్రధానంగా బాలీవుడ్ బడా హీరోల బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందో చెబితే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మీరు విన్నది నిజమే. ప్రభుత్వ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందుకోని భారీ జీతాన్ని వారు అందుకోవటం విశేషం. ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తు బాడీగార్డ్ జితేంద్ర షిండే. ఇతని ఏడాది జీతం అక్షరాల రూ.1.50 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతనెక్కడికి వెళ్లినా కాపలా నమ్మకంగా ఉంటూ భారీ జీతాన్ని అందుకుంటున్నాడు.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరోల్లో ఒకరు సల్మాన్ ఖాన్. ఆయన బాడిగార్డ్ షరజీతమ్ ఏడాదికి రెండు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ శరసింగ్ ఏడాది జీతం రూ.2.70 లక్షలు, అనుష్క శర్మ బాడిగార్డ్ ఏడాది జీతం 1.20 లక్షలు, దీపికా పడుకోణె బాడీగార్డ్ జీతం రూ.1.20 లక్షలు వెచ్చిస్తూ ఫ్యాన్స్ అల్లర్ల నుంచి తప్పించుకుంటారు ఈ బడా హీరోలు.