ఈ ఫోటోలో ఉన్న చిన్నారులను గుర్తుపట్టారా? ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోలు. ఎవరో గుర్తుపట్టారా?
ఈ హీరోలను గుర్తుపట్టారా? ఇద్దరూ అన్నదమ్ములే. ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని క్యూట్ గా ఫోటో దిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోలు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అన్నయ్య ఏమో చిన్న సినిమాల్లో సైడ్ కేరెక్టర్లు చేసుకుంటూ ఒక్కసారిగా సెకండ్ హీరోగా అందరికీ నోటెడ్ అయితే.. తమ్ముడేమో ఇయన్నీ కాదని డైరెక్ట్ హీరోగా ఒక సినిమా చేసి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డు కూడా గెలుచుకున్నారు. అన్నయ్యకి మూడు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తేనే గానీ లీడ్ హీరోగా సినిమా చేసే అవకాశం రాలేదు. కానీ తమ్ముడు మాత్రం మొదటి సినిమాతోనే హీరోగా చేసి.. రెండో సినిమాతో గుండెల్ని మెలిపెట్టే మధ్యతరగతి కథతో అలరించి పడేశారు.
అన్నయ్య ఏమైనా తక్కువ తిన్నారా? తమ్ముడు ఎంట్రీ ఇచ్చే ముందే హై వోల్టేజ్ యాటిట్యూడ్ తో అన్నయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసిండు. ఎవరో గుర్తుపట్టారా? తమ్ముడు పుష్పక విమానం ఎక్కి హైవే మీద బేబీతో దూసుకుపోతుంటే.. అన్నయ్య పెళ్లిచూపులు అయ్యాక ద్వారకా వెళ్లి అర్జున్ రెడ్డిని కలిసి ఏ మంత్రం వేసావే అని మహానటిని కలిసి గీత గోవిందం అని చెప్పి నోటా నొక్కి ఈ నగరానికి ఏమైంది అని చెప్పి మధ్యలో కాసేపు అలరించి టాక్సీవాలాలా, డియర్ కామ్రేడ్ లా మారి మీకు మాత్రమే చెప్తా అని.. వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యి జాతిరత్నాలు బ్లూ షర్ట్ వేసుకుని సందడి చేసి.. లైగర్ తో బాలీవుడ్ లోకి వెళ్లి ఇప్పుడు సమంతతో ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి వస్తున్నారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ అని గుర్తుపట్టి ఉంటారే. మరే ఆ పై ఫోటోలో పొడుగ్గా ఉన్న బాబు విజయ్ దేవరకొండ అయితే.. మరొకరు ఆనంద్ దేవరకొండ. హిట్ వచ్చినా, ప్లాప్ వచ్చినా ఒక కొండలా నిలబడిపోయే రకం ఈ ఇద్దరూ. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో చిన్న రోల్స్ లో నటించిన విజయ్.. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో రేంజ్ వచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. టాక్సీవాలా తర్వాత వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఖుషీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆల్రెడీ బేబీ సినిమాతో సక్సెస్ కొట్టేశారు. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే, తాజాగా బేబీ ఇలా వైవిధ్యమైన కథలతో అలరిస్తూ వస్తున్నారు. త్వరలో గం గం గణేశా సినిమాతో అలరించనున్నారు. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ములకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అదన్నమాట మేటర్.