ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోలలో తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలకు ఇది క్రూషియల్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. వారు హిట్స్ లో ఉన్నా.. ప్లాప్స్ లో ఉన్నా ట్రాక్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోలలో తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి ఒకరిద్దరు హీరోల పేర్లు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తుంటే.. తెలుగు నుండి మాత్రం ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా పెద్ద లిస్టే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అంటే.. పెద్ద హీరోలే కాదు.. అడివి శేష్, నిఖిల్, విజయ్ దేవరకొండ లాంటి మీడియమ్ హీరోలు సైతం తెలుగు సినిమా పేరును వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలకు ఇది క్రూషియల్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. వారు హిట్స్ లో ఉన్నా.. ప్లాప్స్ లో ఉన్నా ట్రాక్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఆ విధంగా టాలీవుడ్ నుండి ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే అనే పరిస్థితిలో ఉన్న హీరోలు ఎవరంటే.. ముందుగా డార్లింగ్ ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే.. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో నిరాశపరిచాడు. సో.. ఇప్పుడు తన పాన్ ఇండియా పేరు నిలబెట్టుకోవాలంటే.. ఆదిపురుష్, సలార్ లతో హిట్స్ కొట్టాల్సి ఉంది. ఇక గతేడాది ‘సర్కారు వారి పాట’ మూవీతో పరవాలేదు అనిపించిన మహేష్ బాబు.. ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘SSMB28’ చేస్తున్నాడు. నెక్స్ట్ రాజమౌళితో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. కాబట్టి.. మహేష్ కి త్రివిక్రమ్ మూవీ హిట్టు తప్పనిసరి.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. తదుపరి సినిమాలతో హిట్స్ కొట్టి.. స్టార్డమ్ ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో.. చరణ్ కి RC15, ఎన్టీఆర్ కి కొరటాల మూవీ చాలా ఇంపార్టెంట్. పైగా ఎన్టీఆర్ నుండి గత 6 ఏళ్లలో కేవలం 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఎక్కువ సినిమాలు చేయాలనీ కోరుతున్నారు. అలాగే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఈసారి పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొడితేనే.. పుష్పకి వచ్చిన రెస్పాన్స్ కి సరైన న్యాయం జరిగినట్లు అవుతుంది. సో.. బన్నీకి పుష్ప 2 ఖచ్చితంగా బిగ్ హిట్ అవ్వాల్సి ఉంది. పైగా డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఇది కీలకమైన మూవీ. భీమ్లా నాయక్ తో పరవాలేదనిపించిన పవన్.. తదుపరి సినిమాలతో హిట్స్ కొట్టాల్సిన టైమ్ వచ్చేసింది.
వీరంతా పాన్ ఇండియా స్థాయిలో పేరొందిన టైర్ 1 హీరోలు. వీళ్ళు కాకుండా హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ హిట్ తర్వాత ‘అంటే సుందరానికి’ మూవీతో నిరాశపరిచాడు. ఇప్పుడు ఏకంగా దసరా మూవీతో పాన్ ఇండియా ప్రయోగం చేసేందుకు రెడీ అయిపోయాడు. సో.. నాని ట్రాక్ లో పడాలంటే దసరా వైభవము చూపాల్సిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గతేడాది ‘లైగర్’తో ప్రయోగం చేశాడు. కానీ.. అది డిజాస్టర్ అవ్వడంతో ప్రెజెంట్ ఖుషి చేస్తున్నాడు. సో.. విజయ్ కి ఖుషి చాలా హిట్ చాలా అవసరం. మేజర్ మూవీతో అడివి శేష్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ.. రీసెంట్ గా హిట్ 2తో విజయం అందుకున్నాడు. నెక్స్ట్ గూఢచారి 2ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాడు. సో.. శేష్ హిట్ ట్రాక్ కొనసాగాలంటే గూఢచారి 2 హిట్ పడాల్సిందే. ఇక కార్తికేయ 2తో హీరో నిఖిల్.. ధమాకా సినిమాతో మాస్ రాజా రవితేజ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. వీరిద్దరికి కూడా తదుపరి సినిమాలు చాలా ముఖ్యమనే చెప్పాలి. నిఖిల్ కార్తికేయ 3, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి.
ఇక చాలా ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ.. గతేడాది బింబిసారతో బిగ్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇటీవల అమిగోస్ తో నిరాశపరిచాడు. సో.. కళ్యాణ్ రామ్ కంబ్యాక్ హిట్ ఇవ్వాల్సి ఉంది. ఇదే వరుసలో చాలామంది మీడియమ్ రేంజ్ హీరోలతో పాటు చిన్న హీరోలు సైతం బాక్సాఫీస్ వద్ద హిట్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల హిట్స్ అందుకున్నవారు ఓకే.. కానీ.. ఆల్రెడీ ప్లాప్స్ చవిచూసిన హీరోలకు నెక్స్ట్ సినిమాలన్నీ చాలా కీలకం. సో.. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద హిట్టుతో సౌండ్ చేస్తేనే.. కెరీర్ లో ట్రాక్ సాఫీగా సాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఇందులో కొందరు హీరోల సినిమాలపై మాత్రం పక్కా హిట్టు కొడతాయనే నమ్మకాలు కూడా ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఎందుకంటే.. ఆయా సినిమాలు క్రియేట్ చేస్తున్న బజ్ మామూలుగా లేదు. ఇదంతా పక్కన పెడితే.. సినిమా ఫలితాన్ని ముందుగానే ఎవరు అంచనా వేయలేరు కాబట్టి.. అందరూ హిట్స్ కొట్టి సేఫ్ జోన్ చేరిపోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి మనం చర్చించుకున్న హీరోలలో మీ అభిమాన హీరోలు ఎవరున్నారు లేదా మిస్ అయ్యారో కామెంట్స్ లో తెలపండి.