తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏడాది కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ కొందరు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా రచన, దర్శకత్వం అంటూ వారి మల్టీటాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి మల్టీటాలెంటెడ్ హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సిద్ధు.. ఎంబీఏ పూర్తిచేసి సినీరంగంలో అడుగుపెట్టాడు.
2009లో సైడ్ క్యారెక్టర్స్ తో కెరీర్ ప్రారంభించిన సిద్ధు.. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇండస్ట్రీలో కొందరు హీరోలుగా మాత్రమే సినిమాలు చేస్తూ పోతారు. కానీ సిద్ధు తన మల్టీటాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతున్నాడు. సిద్ధు యాక్టింగ్ చేయడమే కాకుండా సినిమాలు రాయగలడు కూడా. ముఖ్యంగా తన సినిమాలకు స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కూడా రాసేస్తున్నాడు.డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గుంటూరు టాకీస్ సినిమాతో సిద్ధు రైటర్ గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాథ వినుమా సినిమాలు చేసి రచన సహకారం అందించాడు. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ సినిమా చేశాడు. విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకి స్టోరీతో పాటు డైలాగ్స్ కూడా రాసాడు సిద్ధు. అలాగే డైరెక్టర్ తో కలిసి స్క్రీన్ ప్లే లో కూడా భాగమవ్వడం విశేషం.
ప్రస్తుతం డీజే టిల్లు సాంగ్స్, ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లోని ప్రతి డైలాగ్ ట్రెండ్ అవుతుందంటే.. ఆ క్రెడిట్ అంతా సిద్ధుకే చెందుతుంది. ప్రస్తుతం డీజే టిల్లు మూవీని నిర్మించిన సితార బ్యానర్ లోనే ‘నరుడి బ్రతుకు నటన’, మరో సినిమా చేస్తున్నట్లు తెలిపాడు సిద్ధు. దాదాపు పదేళ్ల తర్వాత సిద్ధు ఇండస్ట్రీలో ఓ హీరోగా, రైటర్ గా నిలదొక్కుకుంటున్నాడు. మరి హీరో కం రైటర్ అయిన సిద్ధు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంటాడేమో చూడాలి. మరి డీజే టిల్లు డైలాగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.