బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినప్పటికీ.. బిగ్ బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అంటారు. బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్ బాస్ షోకి నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ తో బాగా ఫేమ్ అయిన కొంత మంది కంటెస్టంట్లు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలా అవకాశాలు దక్కించుకుంటున్నవారిలో దివ్య వైద్య ఒకరు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దివ్య కి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉండేది. సినిమాలపై మక్కువతో 2017 లో మోడలింగ్ తో కెరీర్ ఆరంభించింది. లెట్స్ గో అనే షార్ట్ ఫిలిమ్ లో నటించిందిన దివ్య తర్వాత మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన అందంతో పాటు ఆటతీరులో మంచి ప్రదర్శన, నిజాయితీ చూపించి 49 రోజుల పాటు మిగిలిన ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి ఎలిమినేట్ అయ్యింది.
అదిరిపోయే అందం.. అభినయం కలగలిపి ఉన్న దివ్య ఇప్పుడు వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో కీలక పాత్రలో నటించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే దివి హాట్ ఫోటో షూట్స్, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. క్యాబ్ స్టోరీ, లంబసింగి మూవీస్ లో నటించింది. మరికొన్ని ప్రాజెక్ట్ చేతిలో ఉన్నాయి. తాజాగా దివి కుర్రాళ్ల మతులు పోయే విధంగా తన అందాల ఆరబోతతో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.