Director Shankar : ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా, ప్రముఖ డైరెక్టర్ శంకర్ ‘‘ ఆర్ ఆర్ ఆర్ ’’ సినిమాను, దర్శకుడు రాజమౌళిని, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల నటనను కొనియాడారు. ఆయన తన ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. మంచి సినిమాను తమకు అందించిన ఆర్‌ఆర్‌ఆర్ టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిజేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటన మన హృదయాల్ని దోచుకుంటుందని అన్నారు. సినిమాపై మన నమ్మకాలు ఒమ్ముకావని తెలిపారు. రాజమౌళిని ‘‘మహారాజ’’ అంటూ కొత్త బిరుదు ఇచ్చారు.
నిన్న డైరెక్టర్ సుకుమార్ కూడా రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు. ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. ‘మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు. మేము చూడగలం అంతే’ అని అన్నారు. శంకర్ ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తెరమీదకు RRR 2.. జక్కన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా..?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.