మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట లిటిల్ ప్రిన్సెస్ రాకతో కొద్ది రోజులు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట లిటిల్ ప్రిన్సెస్ రాకతో కొద్ది రోజులు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతన్న ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. శంకర్ ‘ఇండియన్ 2’ తో పాటు ఈ సినిమా షూటింగ్‌ను కూడా సమానంగా చేస్తున్నారు. అంజలి, కియారా అద్వాణీ, సునీల్, నాజర్, శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె.సూర్య తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో సినిమా కన్ఫమ్ చేశాడు చరణ్. పాన్ ఇండియా లెవల్లో ఈ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించబోతున్నారు. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. తర్వాత లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతోనూ చెర్రీ వర్క్ చేయబోతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే చరణ్ – శంకర్ కాంబోలో మరో మూవీ రాబోతుందనే న్యూస్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకర్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 30 ఏళ్లవుతోంది.
ఆయన రూపొందించిన మొదటి చిత్రం ‘జెంటిల్‌మెన్’ 1993 జూలై 30 విడుదలైంది. ఈ సందర్భంగా పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన టీంతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు శంకర్. చరణ్ కూడా ఆయనకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. శంకర్ థ్యాంక్స్ చెబుతూ.. ఆగస్టులో మన నెక్స్ట్ మూవ్ కొరకు వెయిట్ చేస్తున్నాను అంటూ రీ ట్వీట్ చేశారు. ఈ మూవ్ అనే పదాన్ని కాస్తా మూవీగా తీసుకుని మరో సినిమా చేయబోతున్నారంటూ పోస్ట్ కనిపించడంతో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి : ‘లియో’ లో రామ్ చరణ్!.. హింట్ ఇచ్చినట్టేనా?
Thank you Ram for your sweet wishes! #GameChanger Can’t wait for our next move this August! 🤗❤️ https://t.co/xd1uyxBljc
— Shankar Shanmugham (@shankarshanmugh) July 31, 2023