దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించేశాడు. ఎన్నో ఏళ్లుగా దక్షిణాది సినిమాలు వెళ్తున్న దిశలను చెరిపేసి.. తెలుగు సినిమా దశను మార్చేశాడు. బాహుబలికి ముందే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి.. బాహుబలితో తెలుగు సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చి, తాను గుర్తింపు పొందాడు. బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత రాజమౌళి నుండి వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది మార్చిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీపడుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇప్పటికే హాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, రచయితలు ప్రశంసలు అందిస్తూ మద్దతుగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ ఆర్ఆర్ఆర్ సినిమా.. హాలీవుడ్ లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంటోంది. మరోవైపు దర్శకుడు రాజమౌళిని కూడా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డులు వరిస్తున్నాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ అందుకుంటున్న అవార్డులపై, రాజమౌళికి దక్కుతున్న గౌరవంపై పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ ట్వీట్ చేస్తూ.. “ది గ్రేట్ రాజమౌళి గారు ప్రపంచాన్ని జయించబోతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు గెలిచినందుకు, లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డులలో రన్నరప్ గా నిలిచినందుకు శుభాకాంక్షలు” అని విష్ చేశాడు. ప్రభాస్ ట్వీట్ పై స్పందించిన రాజమౌళి.. “నాపై నాకే నమ్మకం లేని సమయంలో.. నాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని నువ్వు నమ్మావు.. థాంక్యూ డార్లింగ్” అని బదులిచ్చాడు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఛత్రపతి సినిమాతో ప్రభాస్ ని స్టార్ గా మార్చి, బాహుబలి సిరీస్ తో ఇంటర్నేషనల్ గుర్తింపు తీసుకొచ్చింది రాజమౌళినే. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ స్నేహితులు. వీరి ట్వీట్స్ చూసి ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్, రాజమౌళిల ట్వీట్స్ పై మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.
That’s #Prabhas for you! 🥺❤️ pic.twitter.com/7ZFaO8LQcH
— – (@charanvicky_) December 13, 2022