టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటిదాకా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత గతేడాది వీరి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుండి వచ్చిన ఈ సినిమా.. మరోసారి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్, ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి.. ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ కి క్యారెక్టర్ అయినా చేసేస్తాడని.. తనకు ఎన్టీఆర్ పై తీసిన కొమురం భీముడో సాంగ్ ఆల్ టైమ్ ఫేవరేట్ అని తెలిపాడు రాజమౌళి. జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్ లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ జరిగింది. దీనికి రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కూడా అటెండ్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలలో నామినేట్ అయింది. జనవరి 10న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరగనుండగా.. జనవరి 7న RRR స్క్రీనింగ్ జరిగింది.
ఇక మూవీ స్క్రీనింగ్ అయిపోయాక రాజమౌళి, ఎన్టీఆర్ మీడియా సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ లో తనకు ‘నాటు నాటు’ సాంగ్ చాలా ఇష్టం, కానీ.. దానికంటే కొమురం భీముడో సాంగ్ ఎక్కువ ఇష్టం. ఎన్టీఆర్ తో తీసిన కొమురం భీముడో సాంగ్ నేను తీసిన అన్ని సినిమాలలో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అదీగాక ఎన్టీఆర్ కనుబొమ్మలతో కూడా యాక్ట్ చేయగలడు. బెస్ట్ పెర్ఫార్మర్’ అని రాజమౌళి కొనియాడాడు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. రాజమౌళి మాటలకు నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్టీఆర్ తదుపరి సినిమాని కొరటాల శివతో.. రాజమౌళి నెక్స్ట్ మూవీని మహేష్ బాబుతో చేయనున్న విషయం విదితమే. మరి ఎన్టీఆర్ రాజమౌళిల స్నేహం, ఎన్టీఆర్ నటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.