ప్రస్తుతం యూట్యూబ్ మొత్తం సర్కారు వారి పాట ట్రైలర్ రీ సౌండ్ వస్తోంది. ఎక్కడ చూసినా మహేశ్ బాబు డైలాగులు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు కూడా పెంచేశాయి. తాజాగా డైరెక్టర్ పరుశురామ్ కూడా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి, మహేశ్ బాబుతో తనకున్న అనుబంధం, సినిమా సమయంలో మహేశ్ తనకు గొడవ జరిగిందని వచ్చిన వార్తలపై పరశురామ్ స్పందించాడు. అసలు వారి మధ్య ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి గొడవపై నిర్మాత చిట్టిబాబు క్లారిటీ!
‘సర్కారు వారి పాట సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం పుట్టినదే. సినిమా టైటిల్, డిజైన్ చూడగానే మహేశ్ బాబుకు బాగా నచ్చాయి. కీర్తి సురేష్ కూడా నాకు ఛాయిస్.. ఆ విషయం చెప్పగానే ఓకే అనేశారు. షూటింగ్ సమయంలో మహేశ్ తో జర్నీ ఎంతో ఎంజాయ్ చేశాను. మహేశ్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా తీసే అవకాశం రావడం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. కరోనా వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. కుటుంబ పరంగానూ నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నాన్నకు కరోనా సోకింది. ఆ సమయంలో మహేశ్ నాకు ఒక పదిసార్లు కాల్ చేసుంటారు. ఏం కాదు కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అమ్మకు కూడా ఆరోగ్యం బాలేదు. మహేశ్ డాక్టర్ తో మాట్లాడి నాకు కాల్ చేయించారు. అలా అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ గా ఉన్నారు.నన్ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేశారు.’
‘మా మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉంది. సినిమా సమయంలో మేము గొడవలు పడ్డాం అనే మాటలో వాస్తవం లేదు. కొవిడ్ వల్ల ఈ కథతో మహేశ్ బాబు 3 సంవత్సరాలు ట్రావెల్ కావాల్సి వచ్చింది. షూటింగ్ అన్నాక ఏవో చిన్నచిన్న చిరాకులు, తలనొప్పులు ఉంటూనే ఉంటాయి. ఒక్కోసారి అన్నపూర్ణలో చేయాలనుకున్న షూటింగ్ ఆర్ఎఫ్సీకి మారుతుంది. ఒకోసారి ఇక్కడ తీయాలనుకున్న షాట్ 20 కిలోమీటర్ల అవతల తీయాల్సి వస్తుంది. షూటింగ్ లో వచ్చే ప్రాక్టికల్ ఇబ్బందులు మాత్రమే కానీ, మా మధ్య అంతకు మించి ఏమీ లేదు. మహేశ్ బంగారం అండి.. ఆయన ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే దానిని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ పరశురామ్ వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అనేది అందరికీ అర్థమయ్యేలా తెలియజెప్పాడు. పరశురామ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.