ఈ ఏడాది విడుదలై సక్సెస్ అయిన చిన్న సినిమాలలో ‘లవ్ టుడే’ ఒకటి. కోమాలి ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అటు తమిళంలో బిగ్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో, డైరెక్టర్ ప్రదీప్, ఇవానాల కెమిస్ట్రీతో పాటు మ్యూజిక్, వేరే క్యారెక్టర్స్ అన్ని బాగా కుదిరాయి. అయితే.. సినిమాలో ‘మామకుట్టి’ అనే సౌండ్ ట్రాక్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ క్రమంలో సినిమాలో మామకుట్టి అనే సీన్ ద్వారా స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ట్రోల్స్ ఫేస్ చేసినట్లు తెలుస్తోంది. లవ్ టుడే మూవీలో ఓ కామెడీ సన్నివేశంలో గౌతమ్ మీనన్ ని పోలిన ఓ వ్యక్తి.. హీరోయిన్ వెంటపడే సన్నివేశం ఉంది. ఆ సీన్ చూశాక సదరు కమెడియన్ ని గౌతమ్ మీనన్ తో పోల్చుతూ ట్రోల్స్ చేశారు. దీంతో ఈ విషయంపై ఇటీవల జరిగిన తమిళ దర్శకుల రౌండ్ టేబుల్ సమావేశంలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ పాల్గొని స్పందించాడు. “లవ్ టుడే” సినిమాలో తనపై వచ్చిన ట్రోల్ ను ఎలా వచ్చాయో చెబుతూ.. ఆ క్యారెక్టర్ కోసం తనని అడిగితే నటించేవాడ్ని కదా అని చెప్పాడు.
అవును.. “లవ్ టుడే” మూవీలో హీరో ప్రదీప్, తన లవర్ నికిత ఫోన్స్ మార్చుకున్నాక.. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో లవ్ ప్రపోస్ చేసే అబ్బాయిలలో గౌతమ్ మీనన్ ని పోలిన వ్యక్తి కూడా ఉంటాడు. ఆ పాత్రని గౌతమ్ మీనన్ కి పేరడీగా క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తూ.. కథలు, కవితలు చెబుతుంటుంది. దాన్ని ఫ్యాన్స్ థియేటర్స్ లో ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే.. దీని గురించి మాట్లాడుతూ.. ‘ఆ సీన్ కోసం నన్నే అడిగి ఉండొచ్చు కదా.. నేనే చేసేవాడ్ని’ అంటూ సరదాగా చెప్పాడు. ఇదిలా ఉండగా.. లవ్ టుడేలో గౌతమ్ మీనన్ కి పేరడీగా నటించిన యూట్యూబర్ గురుబాయి మంచి క్రేజ్ సంపాదించుకున్నట్లు సమాచారం. మరి లవ్ టుడే మూవీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
#Gvm On #Lovetoday Troll pic.twitter.com/o8N3SAAMIZ
— chettyrajubhai (@chettyrajubhai) December 28, 2022