గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని.. వారు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని తెలిపారు. గ్రామాల్లో బలగం ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
బలగం.. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు రెండు.. చావు, పుట్టుక. ఈ కథనంతో తెరమీదకు వచ్చిన ఈ సినిమా ఎక్కడా లేని ఆదరణ పొందుతోంది. ఈ భూమ్మీదకు ఒక జీవి వస్తే ఎంత సంబరపడతామో.. అదే జీవి దూరమైతే.. అంతకు రెట్టింపు బాధపడతారు. చావు, దాని చుట్టూ అల్లుకుని ఉన్న సంప్రదాయాలు, ఆ సమయంలో చోటు చేసుకునే భావోద్వేగాలు.. వీటన్నింటిని మేళవించి.. తెరకెక్కించిన చిత్రమే బలగం. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఒగ్గు కథ విని ఏడవని జనాలు లేరంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టుకుంటున్నారు.
బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్ర కథాంశాన్ని తోటివారికి కథలు కథలుగా చెప్తుండటంతో గ్రామాల్లో ఏకంగా పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ఊరంతా ఒక్క చోట చేరి సినిమాను చూస్తున్నారు. ఇలా చేయడం నేరమని.. బలగం సినిమాను కాపీ చేసి ఊరూరా తెరలు కట్టి ప్రదర్శించడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని దిల్ రాజు పోలీసులకు పిర్యాదు చేసినట్లు ఇటీవల కథనాలొచ్చాయి. గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్నంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలను ‘బలగం’ చిత్ర నిర్మాత దిల్ రాజు ఖండించారు.
గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని.. వారు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని తెలిపారు. అలాగే, గ్రామాల్లో జరిగే బలగం ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ చిత్రాన్ని చూసి కుటుంబాలు కలుస్తున్నాయంటే అంతకంటే అదృష్టం ఏముంటుందన్నారు. అయితే ఓటీటీ సంస్థతో న్యాయపరమైన ఇబ్బందులున్నాయని, వాటిని తమ సంస్థ పరిష్కరించుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇంకా గ్రామాల్లో ఏవరైనా బలగం చిత్రం చూడాలనుకుంటే తమకు తెలియజేయాలని.. ఆందుకు తామే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
గ్రామాల్లో వేసే బలగం సినిమా ప్రదర్శనలు మేము ఆపట్లేదు, అమెజాన్ ఓటీటీ నుండి వచ్చిన ఒత్తిడి వల్ల నోటీస్ ఇచ్చాము – దిల్ రాజు, బలగం నిర్మాత#Balagam pic.twitter.com/tYols45ir0
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2023