నేచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల ఆదరణ పొందాడు. తన కెరీర్ లో తొలిసారి ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా టీజర్ రిలీజ్ వేడుకలో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒక కేజీఎఫ్, ఒక ట్రిపులార్, 2023లో ఒక దసరా అని కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యలను అప్పుడు చాలామంది సరదాగా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు అవి సీరియస్ కామెంట్స్ అని పరిగణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు నాని.. లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఫస్ట్ టైమ్ ఒక రగ్‌డ్ లుక్ లో పక్కా మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. దసరా టీజర్ రిలీజ్ సమయంలో నేచురల్ స్టార్ నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేజీఎఫ్, ట్రిపులార్ సినిమా తర్వాత దసరా ఉంటుందంటూ కామెంట్ చేశాడు. అయితే అప్పుడు నాని వ్యాఖ్యలను కొందరు ఫన్నీగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై దిల్ రాజు మనసుపడ్డాడని తెలుసుకుని సినిమాలో విషయం ఉండబట్టే నాని అలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. నాని సినిమా దసరాకి సబంధించిన రైట్స్ ని చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. అయితే దసరా టీజర్ చూసిన తర్వాత దిల్ రాజు ఆ సినిమా కొనాలని నిర్ణయానికి వచ్చారంట. అందుకోసం చదలవాడ శ్రీనివాసరావుకు ఏకంగా రూ.4 కోట్లు అదనంగా చెల్లించి మరీ హక్కులు కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. దిల్ నుంచి ప్రాంతాల హక్కుల కోసం డిస్టిబ్యూటర్లు కూడా క్యూ కడుతున్నారంటూ చెబుతున్నారు.
దిల్ రాజు సినిమా హక్కులు కొన్నారంటూ వచ్చిన వార్తలు చూసి ఈ సినిమా పక్కా హిట్టు అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. 2019లో వచ్చిన జెర్సీ సినిమా తర్వాత హీరో నానికి సరైన బ్రేక్ ఈవెన్ సినిమా లేదు. శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ అయినా కూడా కొన్ని సెంటర్లలో అప్పటి టికెట్ ధరల ఇష్యూ వల్ల సరైన లాభాలు అందుకోలేకపోయింది. అలాంటి నాని సినిమా కోసం దిల్ రాజు ఇంత మొత్తం చెల్లించడం రిస్క్ చేయడమనే చెబుతున్నారు. కానీ, కంటెంట్ మీదున్న నమ్మకంతోనే దిల్ రాజు ఈ రిస్క్ తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. దసరా సినిమాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సింగరేణి, గోదావరిఖని నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో నాని సింగరేణి కార్మికుడిగా కనింపించబోతున్నాడు అనే టాక్ ఉంది. ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.