పిల్లలు తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నప్పుడు శభాష్ అనడమే కాదు, రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు వద్దని వారించడం, వెళ్ళినప్పుడు తప్పు అని వేలెత్తి చూపడం కూడా తండ్రి బాధ్యత. మంచి పని చేసినప్పుడు ప్రశంసలే కాదు, తప్పు చేసినప్పుడు విమర్శలు కూడా అవసరమే. అలా విమర్శిస్తేనే తండ్రిగా తన కొడుకుని ఉన్నత స్థానంలో చూసుకోగలుగుతారు. అలా తన కొడుకుని ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మహేష్ బాబు గొప్ప సినిమా చేసినప్పుడు భుజం మీద చేయి తట్టి శభాష్ అనడమే కాదు.. మహేష్ చేసిన తప్పుని కూడా విమర్శించారు. సరిదిద్దుకోమని సలహా హెచ్చరించారు.
మహేష్ ని ఆ సినిమా చేయొద్దు అంటూ కృష్ణ హెచ్చరించినా.. వినకుండా ఆ సినిమా చేశారు మహేష్ బాబు. సినిమా రిజల్ట్ చూస్తే ప్లాప్ అయ్యింది. దీంతో అప్పుడు తన తండ్రి ఎందుకు వద్దన్నారో మహేష్ కి అర్ధమైంది. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన తండ్రి గొప్ప విమర్శకుడు అంటూ చెప్పుకొచ్చారు. రాజకుమారుడు, మురారి వంటి సినిమాలు చూసి చాలా బాగా చేసావ్ అని కృష్ణ మెచ్చుకున్నారని మహేష్ అన్నారు. మొదటిసారిగా జెన్యూన్ గా రియాక్ట్ అయ్యారని మహేష్ వెల్లడించారు. ఆ సమయంలో చాలా సంతోషం అనిపించిందని అన్నారు. నాని సినిమా చూసి.. ఈ సినిమా ఆడితే మహేష్ స్టార్ కాదు, ఈ సినిమా ప్లాప్ అయితే మహేష్ స్టార్’ అని కృష్ణ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆరోజు ఆయన అన్న మాటలు తనకు అర్ధం కాలేదు గానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్ధమవుతుందని అన్నారు. ఆయన అనాలసిస్ అంత అద్భుతంగా ఉండేదని అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఒక స్టార్ ఇలాంటి సినిమా చేస్తే ఆడదు. స్టార్ హీరోలు ఇలా చేయకూడదు. స్టార్స్ అంటే ప్రయోగాలు చేయకూడదన్న క్లారిటీ తన తండ్రికి ఉందని అన్నారు. అలా కృష్ణ తన అనాలసిస్ తో మూవీ రిజల్ట్ ని ముందుగానే పసిగట్టారు. అదే సమయంలో మహేష్ బాబుకి గుర్తుండిపోయేలా ఒక పాఠాన్ని నేర్పించారు. అయితే మహేష్ ‘వన్ నేనొక్కడినే’ సినిమా తర్వాత తండ్రి చెప్పిన విషయం పట్ల రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నేనొక్కడినే సినిమా 2014లో రిలీజ్ అయితే, 2015లో మహేష్ బాబు ఇంటర్వ్యూ ఇచ్చారు.
స్టార్ హీరోలు ప్రయోగాలు చేయకూడదని తన తండ్రి ఎందుకన్నారో ఇప్పుడు (2015లో ఇంటర్వ్యూ సమయం) అర్ధమవుతుందని మహేష్ అన్నారు. దీంతో ఇక మహేష్ ప్రయోగాల జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయినట్లు ఆయన మాటలను బట్టి అర్ధమవుతుంది. అయితే మహేష్ ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారు గానీ.. నిజానికి ఈ నాని సినిమా ఎవరూ చేయలేనటువంటి ప్రయోగాత్మక సినిమా. అలానే వన్ నేనొక్కడినే మూవీ కొంతమందికి మాత్రమే అర్ధమయ్యే ఒక మాస్టర్ పీస్, కాబట్టి మహేష్ సక్సెస్ అయినట్టే.
ఇప్పటికీ ఈ సినిమాలని చూసి మహేష్ నటనను మెచ్చుకుంటారు. అయితే సీనియర్ అయినటువంటి కృష్ణకి ఈ మాత్రం తెలియదా అంటే.. తెలియక కాదు. ఆయన దృష్టిలో హీరో అంటే నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టడం. ఈ సూత్రాన్ని పాటించాలి తప్ప నిర్మాతలను ముంచకూడదు అనేది కృష్ణ సిద్ధాంతం. అందుకే ఆయనను నిర్మాతల హీరో అనేది. అదన్నమాట విషయం. తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా ప్లాప్ అయితే.. నిర్మాతకి పారితోషికం వెనక్కి తిరిగివ్వడం కూడా హీరో లక్షణం అని చెప్పిన గట్స్ ఉన్న హీరో, గట్స్ ఉన్న తండ్రి కూడా కృష్ణనే. ఆయన బాటలోనే మహేష్ కూడా పయనిస్తున్నారు.