టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌కు అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు పట్టిందల్లా బంగారమైంది. ఒక ప్లేయర్‌గా హార్డ్ హిట్టింగ్‌తో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపించిన ధోని.. కెప్టెన్‌గా మర్చిపోలేని విజయాలు సాధించాడు. అతడి సారథ్యంలో టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లలో ప్రపంచ కప్‌లను ముద్దాడింది. అలాగే టెస్టుల్లోనూ నంబర్ వన్‌గా నిలిచింది. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోని పలుమార్లు కప్ అందించాడు. మిస్టర్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధోని.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అలాంటి ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నాడు.
మూవీ ప్రొడక్షన్ కోసం భార్య సాక్షితో కలసి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థను ధోని నెలకొల్పాడు. తాజాగా ఈ బ్యానర్ మీద తొలి చిత్రానికి సంబంధించిన ప్రకటనను రిలీజ్ చేశారు. ఓ తమిళ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలోకి ధోని ఎంట్రీ ఇస్తున్నాడు. హరీష్ కల్యాణ్, ఇవాన, నదియా, యోగిబాబు లాంటి స్టార్ నటులు ఈ మూవీలో నటించబోతున్నారు. దీనికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించనున్నారు. డైరెక్టర్‌గా ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (ఎల్‌జీఎం) పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు ధోని సతీమణి సాక్షి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ వివరాలను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. మరి, ధోని నిర్మాణ సంస్థలో తొలి చిత్రం తెరకెక్కనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We’re super excited to share, Dhoni Entertainment’s first production titled #LGM – #LetsGetMarried!
Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023