ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ తన అన్నకు ఓ సలహా ఇచ్చారంట..
సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవటం అన్నది సర్వ సాధారణ విషయం. సాధారణ జనంలా కలిసి ఉండి కొట్టుకోవటం కంటే.. విడిపోయి వేరుగా బతకటం మేలని సినీ తారలు భావిస్తూ ఉంటారు. అందుకే సమాజానికి ఏ మాత్రం భయపడకుండా తమకు నచ్చింది చేస్తుంటారు. ఇది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా జరుగుతున్నదే. ఇక, ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని వేరుపడ్డారు. ఇద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ అన్నకు ఓ సలహా ఇచ్చాడంట.
మరోసారి పెళ్లి చేసుకోవద్దని అన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా సెల్వ రాఘవనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా మధ్య కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చినపుడు విడాకులకు అప్లై చేశాము. విడాకులు వచ్చాయి. అప్పుడు ధనుష్ నాతో ఓ మాట అన్నాడు ‘ నువ్వు దీన్నుంచి త్వరగా బయటపడు. దేవుడు నీకు ఓ సరైన అవకాశం ఇచ్చాడు. ఒంటరిగా ఉండు’ అని అన్నాడు. కానీ, గీతాంజలి నా జీవితంలో ఓ మార్పు తీసుకువస్తుందని నేను భావించాను. అదే జరిగింది. నువ్వు నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తే నీలో కచ్చితంగా ఓ పెను మార్పు చోటుచేసుకుంటుంది.
ఒక వేళ అది కూడా విఫలం అయితే, దాన్ని కూడా మార్చు’ అని అన్నారు. కాగా, సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ కలిసి పలు సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన 7జి బృందావన్ కాలనీ సినిమాలో తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2006లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2010లో విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత సెల్వ రాఘవన్, గీతాంజలి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి, సెల్వరాఘవన్‌కు ధనుష్ ఇచ్చిన సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.