రవితేజ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎన్నో కష్టాలు పడి.. చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేకమైన మాస్ అప్పియరెన్స్, కామెడీ టైమింగ్‌తో మాస్ మాహరాజాగా అభిమానులతో పిలుపించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజీకి వచ్చాడో.. రవితేజ ఎన్నడు మర్చిపోడు. అందుకే కొత్తవారికి, ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ కాకుండా కాపాడాడు రవితేజ. తన విసయంలో కూడా రవితేజ ఎంతో మేలు చేశాడని.. అందుకే ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ.. రవితేజ కాళ్లపై పడి నమస్కారం చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.
తాజాగా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమాకా. తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ.. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను రాబట్టింది ధమాకా చిత్రం. ఈ జోరు ఇలానే కొనసాగితే.. అతి త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ధమాకా చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. చిత్ర బృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా హరీష్ శంకర్.. తన జీవితంలో రవితేజకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మాస్ మహారాజ్ అని రవితేజ అన్నయ్యను అని మొదట పిలిచింది నేనే. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి అన్నయ్యను అలానే పిలిచే వాడిని. ఓ ఫంక్షన్‌లో.. రవితేజ అన్నను.. మాస్ మహారాజ్ అని పిలవమని సుమకు చెప్పాను. అప్పటి నుంచి మీరంతా.. ఆ పేరును ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా హ్యాపీ. రవితేజ అన్నయ్య ఎప్పుడు నా వెనకే ఉన్నారు. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నా.. ఇండస్ట్రీలో ఉన్నా.. అందుకు కారణం రవితేజ అన్నయ్య అని చాలా సార్లు చెప్పాను’’ అంటూ హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు.
‘‘రవితేజ్ వల్ల దర్శకులుగా మారిన వారిలో.. మలినేని గోపిచంద్, వైట్ల శ్రీను, బోయపాటి శ్రీను, బాబీ, హరీష్ శంకర్, టైగర్ నాగేశ్వర్ డైరెక్టర్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దదవుతుంది. ఇక నా మొదటి సినిమా షాక్ భారీ డిజాస్టర్ అయితే.. నాకు మరో అవకాశం ఇచ్చి.. రెండో సినిమా మిరపకాయ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చింది రవితేజ అన్ననే. ఇప్పటి వరకు అన్నయ్యను కలిసిన ప్రతీ సారి.. నేను కౌగిలించుకోవడం చేస్తుంటాను. స్టేజ్ మీద దండం పెట్టాలంటే.. ఎప్పుడూ గుర్తుకు రాలేదు. కానీ ఈ రోజు.. సభాముఖంగా నీ నీ మీద నాకున్న గౌరవం, భక్తి, ప్రేమను సభాముఖంగా వెల్లడించాలనుకుంటున్నాను. అందుకే దండం పెట్టాను. మరోక విషయం లేదు’’ అని హరీష్ భావోద్వేగానికి లోనయ్యాడు.
‘‘ఇక సోషల్ మీడియాలో చాలా మంది మేధావులు రవితేజ గురించి చాలా రకాల కామెంట్లు చేశారు. టైమ్, సినిమా ప్రేక్షకుల అభిరుచి మారింది. పాటలు, ఫైట్లు ఉండే సరిపోవు అంటూ కామెంట్స్ చేసిన వాళ్లకు.. ధమాకా సినిమాతో చెప్పుతో కొట్టినట్టు రవితేజ అన్న సమాధానం చెప్పాడు. ఈ రాత్రితో ధమాకా సెలబ్రేషన్స్ ఆగిపోవు. రేపట్నుంచి సినిమా కలెక్షన్లు సంక్రాంతి వరకు కొనసాగుతాయి. ఇండస్ట్రీ షాక్ అయ్యే వసూళ్లను నమోదు చేస్తుంది అన్నాడు రవి శంకర్. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.