టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లకు ఎంత క్రేజ్ ఉందో.. వారితో పోటీగా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అంతో ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా పాటలు అనగానే ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ పేర్లు మాత్రమే గుర్తొస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరిని మించి ఒకళ్లు హిట్లు కొడుతున్నారు. పుష్పతో డీఎస్పీ రికార్డులు బద్దలు కొడితే.. అఖండతో తమన్ రికార్డులు తిరగరాశాడు. డీఎస్పీ హవా తగ్గిపోయిందని, తమన్ టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు అంటూ ఎన్నో మాటలు వినిపించాయి. తమన్ వల్లే డీఎస్పీ కెరీర్ ట్రాక్ తప్పిందని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. వారు ఇద్దరికీ అసలు పడదు అని కూడా నచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి చూపించేందుకు ఒక అద్భుతమైన వీడియో దొరికింది.
డీఎస్పీ– తమన్ ఇద్దరూ ఒక స్టేజ్‌పై కలిశారు. ఈ కార్యక్రమం ఏంటి? ఎక్కడ జరిగింది? అనే విషయాలపై క్లారిటీ లేదు. ఓ పార్టీలో తమన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తన్నాడు. అక్కడే దేవీశ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు. తమన్- డీఎస్పీ గురించి మాట్లాడుతూ అతడిని స్టేజ్ మీదకు పిలిచాడు. నా ఫ్రెండ్ డీఎస్పీ కూడా ఇక్కడే ఉన్నాడని తెలుసు. ఐ లవ్ యూ డీఎస్పీ అంటూ చెప్పాడు. వెంటనే డీఎస్పీ కూడా స్టేజ్ మీదకు వచ్చి.. ఐ లవ్ యూ టూ అంటూ తమన్‌ని హగ్ చేసుకుంటాడు. డీఎస్పీ పాటపాడలని తమన్ పట్టుబడతాడు. అదికూడా తమన్ పాట డీఎస్పీ పాడాలి, డీఎస్పీ పాట తమన్ పాడతానని చెప్పాడు. డీఎస్పీ కోసం తమన్ డ్రమ్స్ కూడా వాయించాడు. తర్వాత డీఎస్పీ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల పాట పాడాడు. ఆ పాటకు తమన్ డ్రమ్స్ వాయించగా.. డైరెక్టర్ హరీశ్ శంకర్ స్టెప్పులేశాడు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే.. ఏ ఇండస్ట్రీలో అయినా ఇద్దరి మధ్య పోటీ నెలకొన్న సమయంలో వారికి తెలియకుండానే వారు శత్రువులుగా మారిపోతారు. అయితే తమన్– డీఎస్పీ మాత్రం అందుకు అతీతులు. ఏ సందర్భం అయినా ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉంటారు. ఏ కార్యక్రమానికి అయినా కలిసి వెళ్తారు. ఇద్దరి సినిమాలకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. మంచి మిత్రులుగా, అన్నదమ్ముల మాదిరిగా వారి మధ్య మంచి బాండింగ్ ఉంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా మిత్రులను మాత్రం మర్చిపోకూడదు అని వీళ్ల స్నేహం అందరికీ చెబుతూ ఉంటుంది.