రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి యావత్ దేశంలోనే స్పెషల్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో సినిమాలతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఇంటర్వ్యూలు, కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నాడు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేస్తే ఆ యాంకర్ కు చాలా మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే అరియానా గ్లోరీ, అషూరెడ్డీలు బోల్డ్ బ్యూటీలుగా పాపులర్ అవ్వడం చూశాం. తాజాగా ఈ జాబితాలోకి మరో యాంకర్ చేరింది. ఆమె పేరు సాయిదివ్య. ఇటీవల రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతా అసలు ఎవరు ఈ యాంకర్ అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు.
సాయిదివ్య చాలారోజులుగా యాంకర్ గా ఇంటర్వ్యూలు చేస్తోంది. కానీ, చాలా మందికి ఆమె గురించి తెలియదు. కానీ, ఒక్క రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అంతా ఎవరు ఈ బ్యూటీ.. లేడీ ఆర్జీవీలా ఉంది అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూలో ఎన్నో బోల్డ్ ప్రశ్నలు ఆర్జీవికి సంధించింది. ఎన్నో బోల్డ్ ప్రశ్నలను ఎంతో ధైర్యంగా రామ్ గోపాల్ వర్మను అడిగింది. ఇంక ఆయన కూడా అంతే బోల్డ్ గా సమాధానం చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మీకు సె*క్స్ లో ఎలాంటి భంగిమలు ఇష్టం అని కూడా అడిగేసింది. అందుకు ఆర్జీవీ నాకు అన్నీ ఇష్టమే అంటూ సమాధానం కూడా చెప్పాడు.
అయితే ఆ ఇంటర్వ్యూకి ఆశించిన దానికన్నా ఎంతో రీచ్ లభించింది. అయితే తర్వాత సాయిదివ్య మరోసారి ఆ ఇంటర్వ్యూ గురించి అభిమానులతో పంచుకుంది. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది? ఇంటర్వ్యూ తర్వాత ఆర్జీవీ ఏం మాట్లాడాడు? ఆ విషయాలను పంచుకుంది. “నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వేరే ఇంటర్వ్యూ ఉంది.. కాసేపు వెయిట్ చెయ్యి అని అన్నారు. అంతా ఆర్జీవీ ఏమన్నారు. ఎందుకు వెయిట్ చేయమన్నారు.. అంటూ అడుగుతున్నారు. ఆ 20 నిమిషాలు నేను కూడా ఎంతో భయపడ్డాను. నా ప్రశ్నలు నచ్చలేదు అనుకున్నాను. ఇంటర్వ్యూని ఆపేయమంటారా అనే భయాందోళన నాలో కలిగింది. ఆ కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు” అంటూ చెప్పుకొచ్చింది.
“ఆ ఇంటర్వ్యూ తర్వాత సార్ నాతో మాట్లాడారు. నా వాయిస్ పిచ్ చాలా బాగుందని చెప్పారు. నేను ఇంకా కొంచం మేకోవర్ చేసకోవాలి అని చెప్పారు.హెయిర్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి కాస్త మార్చుకోవాలి అని సూచించారు. డ్రెస్లు కూడా మంచిగా వేసుకోవాలని చెప్పారు. కాస్త మార్పులు చేస్తే ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లాగా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. నేను ఇంటర్వ్యూలో బెండ్ అవుతున్నాను.. అలా అవ్వకూడదు అని తెలిపారు. ఆయన అన్నీ గమనిస్తారు. నా భవిష్యత్ కోసం ఆర్జీవీ గారు ఇలా చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. కచ్చితంగా సార్ చెప్పినవి పాటిస్తాను” అంటూ సాయి దివ్య చెెప్పుకొచ్చింది.
ఇంకా రామ్ గోపాల్ వర్మ ఒక మంచి మనసున్న వ్యక్తి అంటూ కితాబిచ్చింది. ఆయన స్త్రీలను గౌరవించమని చెప్పరని.. గౌరవించి చూపిస్తారంటూ కామెంట్ చేసింది. తాను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో మధ్యలో అసిస్టెంట్ ని పిలిచి హుడీస్, జాకెట్స్ తీసుకురామని చెప్పారట. అతను 3 హుడీస్ తీసుకొస్తే.. అది కాదు మొన్న తీసుకున్నాగా నాకు నచ్చింది అని అది తీసుకురా అని చెప్పారట. వెంటనే అతను రెడ్ కలర్ జాకెట్ తీసుకొచ్చాడు. అది సాయిదివ్యకు ఇచ్చాడట. ఆమెకు చలిగా ఉందని చెప్పకుండానే ఆర్జీవీ గ్రహించి ఇలా చేశారట. అదే విషయాన్ని సాయిదివ్య చెప్తూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆర్జీవీ- బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి కాలికి ముద్దు పెట్టుుకోవడం, ఆమె కాలి వేళ్లు నాకడం చూశాం. ఆ తర్వాత ఈ ఇంటర్వ్యూకి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తోంది.