షణ్ముఖ్ జశ్వంత్-దీప్తి సునైనా సంవత్సరం క్రితం విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే వారు విడిపోయిన దగ్గర్నించి ఏదో ఒక సందర్భంలో దీప్తి తన బ్రేకప్ గురించి చెప్పుకొస్తూనే ఉంది. తాజాగా మరోసారి బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.
దీప్తి సునైనా-షణ్ముఖ్ జశ్వంత్ జంటకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబ్ స్మాష్ లతో పాటుగా టిక్ టాక్ వీడియోస్ అలాగే కవర్ సాంగ్ లు చేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు ఈ యువ జంట. ఈ క్రమంలోనే వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు రిలేషన్ షిప్ ను కొనసాగించారు. ఇలా 5 సంవత్సరాల పాటు సాగింది వీరి ప్రేమ బంధం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్. ఇక అక్కడి నుంచి వీరి మధ్య ఎడబాటు మెుదలైంది. అదీకాక బిగ్ బాస్ హౌజ్ లో సిరీతో షణ్ముఖ్ సన్నిహితంగా మెలగడంతో దీప్తి తట్టుకోలేక పోయింది.
దాంతో షణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే బ్రేకప్ చెప్పింది దీప్తి. ఇన్ స్టా గ్రామ్ లో బ్రేకప్ గురించి ఓ పెద్ద పోస్టే పెట్టింది దీప్తి. తమ 5 సంవత్సరాల రిలేషన్ షిప్ లో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదరైయ్యాయని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తర్వాత బ్రేకప్ అయినట్లు క్లారిటీ కూడా ఇచ్చాడు జశ్వంత్. ఇక అప్పటి నుంచి ఇద్దరు తమతమ కెరీర్ లపై దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో దీప్తి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మనందరికి తెలిసిందే. తన హాట్ హాట్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. వారి ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది కూడా. తాజాగా మరోసారి ఇన్ స్టాలో ఫాలో వర్స్ తో చిట్ చాట్ చేసింది ఈ సోయగం. ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఓపెన్ ఆన్సర్ ఇచ్చింది దీప్తి. బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటి అని నెటిజన్ ప్రశ్నించగా.. రోజు రోజుకు రోబోలా అయిపోతున్నా అని సమాధానం ఇచ్చింది ఈ సొగసరి. మరో నెటిజన్.. ఒక మనిషిని మీ పర్సనల్ స్పేస్ లోకి తీసుకోవాలంటే అతడిలో ఏం చూస్తారు? ఎంత టైమ్ సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘నన్ను నవ్విస్తే చాలు’ అంటూ సింపుల్ గా చెప్పుకొచ్చింది. మరికొన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చింది దీప్తి.
ఇక విడిపోయిన తర్వాత ఎవరి కెరీర్ పై వారు దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నారు. షణ్ముఖ్ పలు వెబ్ సిరీస్ లు చేస్తూ, కవర్ సాంగ్స్ లో మెరుస్తుండగా.. దీప్తి సైతం తన వెబ్ సిరీస్ లు కవర్ సాంగ్ లతో దూసుకెళ్తోంది. ఇక షణ్ముఖ్-దీప్తిలు విడిపోయి సంవత్సరం కావొస్తున్నా గానీ ఇంకా వారి జోడీ గురించి చర్చించుకుంటూనే ఉన్నారు నెటిజన్లు. ఇక మరికొంత మంది నెటిజనులు అయితే మీరు విడిపోకుండా ఉంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తుంటే.. ఇంకొందరేమో మీరు మళ్లీ కలవాలని కొరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. మరి దీప్తి సునైనా చిట్ చాట్ లో ఇచ్చిన ఆన్సర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.