విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "దాస్ కా ధమ్కీ". విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వరుసపెట్టి హిట్లు కొడుతూ.. మంచి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో తాజాగా ప్రకటించేశారు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “దాస్ కా ధమ్కీ”. విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వరుసపెట్టి హిట్లు కొడుతూ.. మంచి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమా రిలీజ్ చేశాడు. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పిలవడంతో ఈ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన ప్రతి చోట ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో తాజాగా ప్రకటించేశారు.
విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఈ యంగ్ హీరో నటించిన ఫలక్ నామా దాస్, పాగల్, హిట్, అర్జున్ కళ్యాణం లాంటి చిత్రాలు విజయాన్ని అందించడమే కాదు నటుడుగాను మంచి పేరు తీసుకొచ్చాయి. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా తన సత్తా చూపిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు “దాస్ కా ధమ్కీ” చిత్రం విడుదలై నిన్నటితో మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూడు రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని సమాచారం. ఈ సినిమా తొలిరోజే విశ్వక్ సేన్ కెరీర్లో రికార్డ్ ఓపెనింగ్స్ అందుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రోజులు కూడా వీకెండ్ డేస్ కావడంతో ఈ సినిమాకి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఒక్క నైజాం ఏరియాలోనే 3 కోట్ల బిజినెస్ జరగడం గమనార్హం. 9 కోట్ల టార్గెట్ తో దిగిన దాస్ కా ధమ్కీ చిత్రం ఇంకెంత వసూల్ చేస్తుందో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
1️⃣5️⃣Cr GBOC in 3 Days 🔥
The ‘Das ka Mass Blockbuster’ #DasKaDhamki is running successfully with extraordinary response from the audience💥💥
ALL TIME HIGHEST for#VISHWAKSEN😎@VishwakSenActor @Nivetha_Tweets @VScinemas_ pic.twitter.com/6Hy0JWYZMK
— VanmayeCreations (@VanmayeCreation) March 25, 2023