అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నారు. వివాహంతో ఒకటైన ఆ ప్రేమ జంట విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలు సినీ వర్గాలు సహా అభిమానులను కూడా షాక్‌కు గురిచేసున్నాయి. ఈ వార్తలను తోసిపుచ్చుతున్నారు తప్ప వారిలో ఎవరూ అవన్నీ పుకార్లు, మా మధ్య వివాదాలు లేవు.. చక్కగా ఉన్నాము అంటూ ఖండించింది లేదు. వారి మౌనాన్ని ఆసరాగా తీసుకుని మరికొందరు ప్రచారాలు ప్రారంభించారు. ఇదే విషయమై నాగచైతన్య, సమంత విడాకుల పుకార్ల అంశంపై నటి శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి.
తమిళంలో కొన్ని ఆఫర్లు రావడంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి చెన్నైకి మకాం మార్చింది శ్రీరెడ్డి. అప్పుడప్పుడు అభిమానులు అడిగిన అంశాలపై వీడియోస్ రూపంలో సమాధానం ఇస్తూ ఉంటుంది. అలాగే కొందరు తనను సమంత-నాగచైతన్య రిలేషన్‌పై మాట్లాడాల్సిందిగా కోరారంటూ ఓ వీడియో ద్వారా స్పందించింది శ్రీరెడ్డి. ‘నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్లు చెప్తున్న మాటలు, అభిప్రాయాలను మీకు తెలియజేస్తున్నా. సమంత ఇదేం పని అంటూ తమిళనాడులో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లావు కదా. ఆడపిల్లగా నువ్వు కూడా కొంచెం సర్దుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇగోలకు, యాటిట్యూడ్‌లకు వెళ్లకుండా సర్దుకుని సంసారం చేసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు’ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సంసారం అన్నాక వివాదాలు సహజమని.. ‘నాగచైతన్య అన్నయ్య మీరు కూడా సర్దుకుని మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని అభిమానిగా.. మీ మంచి కోరే శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నా’ అంటూ శ్రీరెడ్డి తెలిపింది.