తెలుగు బుల్లితెరపై క్యూట్ పెయిర్స్ కి కొదవ లేదు. వీరిలో జబర్దస్త్ అవినాష్-బిగ్ బాస్ అరియానా మాత్రం చాలా స్పెషల్. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఇక హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా అవినాష్-అరియానా బంధం కొనసాగింది. ఒకానొక టైమ్ లో అవినాష్-అరియానా పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అన్న వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే.., ఏమైందో తెలియదు గాని అవినాష్-అరియానాకలసి స్క్రీన్ పై కనిపించడం మానేశారు. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే.., ఇప్పుడు వీరిద్దరి మధ్య వచ్చిన ఈ గ్యాప్ కి చిన్న గొడవే కారణంగా తెలుస్తోంది. ఈ గొడవకి కారణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఆర్జీవీ ఇంటర్వ్యూతోనే అరియానా ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది. ఆ తరువాత బిగ్ బాస్, అక్కడి నుండి సెలబ్రెటీ స్టేటస్ అంతా ఆ ఇంటర్వ్యూ పుణ్యమే. అయితే.. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక కూడా అరియానా ఆర్జీవీతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. అవినాష్ కి క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడే.. ఈ అమ్మడు ఆర్జీవీతో కలసి జిమ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ అరియానా ఎంత పేరు తెచ్చి పెట్టిందో, అంతే ట్రోల్స్ కి గురి చేసింది. అయితే.., ఈ విషయంలోనే అరియానా-అవినాష్ మధ్య గొడవ జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
చాలా రోజుల గ్యాప్ తరువాత అరియానా-అవినాష్ కలసి కామెడీ స్టార్స్ పోగ్రామ్ లో ఓ స్కిట్ లో నటించారు. ఇందులో అవినాష్ ఆర్జీవీలా యాక్ట్ చేస్తూ.., అరియానా ఫిగర్ పై కామెడీగా కొన్ని పంచ్ లు వేశాడు. ఇక్కడ కామెడీ బాగానే వర్క్ అవుట్ అయినా, ఈ స్కిట్ కారణంగానే గొడవకి గల అసలు కారణాలు బయటపడ్డాయి. స్కిట్ అయిపోయాక.. హోస్ట్ శ్రీముఖి వీరి గొడవ గురించి ప్రశ్న అడిగింది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మీ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకు విడిపోయారు? అంటూ అడిగేసింది. దీంతో..అవినాష్ కాస్త ఎమోషనల్ గా అసలు నిజాన్ని బయటపెట్టాడు.
“ఫ్రెండ్ తప్పు దోవన వెళ్తుంటే.. ఇది రాంగ్ వే. నాకంటూ.. ఒక ఎక్స్ పీరియన్స్ ఉంది. అలా వెళ్ళకు అని రెండు మూడుసార్లు చెప్పాను. రెండు మూడు సార్లు నేను మాట్లాడటం మానేశాను. ఆ సమయంలో అరియానానే వచ్చి మాట్లాడించుకుంది. కానీ.., కెరీర్ ని తాను ప్లాన్ చేసుకున్న మార్గం నచ్చకనే మా మధ్య గొడవ జరిగింది” అని అవినాష్ ఓపెన్ అయిపోయాడు. దీంతో.. వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం అర్జీవినే. ఆర్జీవీ జిమ్ ఇంటర్వ్యూ తరువాతనే అవినాష్ హార్ట్ అయ్యి.., అరియానాకి దూరమయ్యి ఉంటాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైతే ఏమి.. మళ్ళీ ఈ ఇద్దరు మిత్రులు కలసి పోయారు. మరి.. అవినాష్-అరియానా మధ్య గోడవకి కారణం అర్జీవి అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.