టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయన కన్నుమూశారని రకరకాలు రూమర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
భారతీయ చిత్రసీమలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు మరణిస్తుండటంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. తమను ఇంతకాలం అలరించిన సినీ సెలబ్రిటీల మరణ వార్తలతో ప్రేక్షకులు, వారి అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇకపోతే, కొంతమంది సెలబ్రిటీలు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారు మరణించారనే రూమర్లు రావడం ఈమధ్య ఎక్కువైపోయింది. సీనియర్ నటుడు శోభన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆయన చనిపోయారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తల్ని ఆయన కుటుంబీకులు ఖండించారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ విషయంలోనూ అలాంటి ఫేక్ వార్తలే బయటకు వస్తున్నాయి.
కమెడియన్ సుధాకర్ మృతి చెందారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఆయన కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలు చిన్న వెబ్సైట్లు కూడా ఆయన మరణించారని న్యూస్ రాశాయి. అయితే ఇది ఫేక్ అని తేలింది. సుధాకర్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టమైంది. దీంతో సుధాకర్‌పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారి మీద ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు పుకార్లు పుట్టించడం సరికాదని ఫైర్ అవుతున్నారు. కాగా, సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి రూమర్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ ఆయన ఒకసారి కోమాలోకి వెళ్లొచ్చారని వార్తలు వచ్చాయి. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్.. పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు.