ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేయడమనేది కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా కమెడియన్స్ గా స్టార్డమ్ అందుకున్నవారు అన్ని తెలుగు, తమిళంతో పాటు అన్ని ఇండస్ట్రీలలో హాస్యం పండించి హీరోలైనవారు ఉన్నారు. అంతెందుకు తెలుగులో హీరోల పక్కన కామెడీ పండించే నటులే.. హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ హీరోగా డెబ్యూ చేసేందుకు రెడీ అయిపోయాడు. అది కూడా ఏకంగా స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో డెబ్యూ మూవీ.
ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు.. సూరి. కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో కమెడియన్ గా మారిన సూరి.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేనే అంబానీ, యముడు, వీడొక్కడే.. ఇలా తమిళ స్టార్స్ అందరి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. ఇప్పుడు హీరోగా మారాడు సూరి. వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి హీరోగా మొదటి సినిమానే రెండు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం. మరోవైపు వెట్రిమారన్ సూర్యతో వాడివాసల్ మూవీ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూరి కనిపించనున్నాడు. ఆ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ బాడీ కూడా రెడీ చేయడం విశేషం. విడుదలై అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ గౌతమ్ మీనన్కీలక పాత్రలలో నటిస్తుండటం మరో విశేషం. మొత్తానికి కమెడియన్ సూరి హీరోగా డెబ్యూ మూవీనే చాలా గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది. చూడాలి మరి వెట్రిమారన్ సినిమాలంటే తమిళంతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. సూరి – వెట్రిమారన్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Viduthalai Kodaikanal Shoot Wrap⭐
Stunt Sequence By Peter Hein Master💥Stars : Soori – Vijay Sethupathi – BhavaniSri – GVM – Rajiv Menon
Music : Ilaiyaraja♥️
Direction : Vetrimaaran (Asuran) 🔥TN Release : Red Giant💥 pic.twitter.com/FW4PbIBEfl
— Saloon Kada Shanmugam (@saloon_kada) September 19, 2022
The stunt sequences in #Viduthalai will definitely create a benchmark for @sooriofficial, @PeterHeinOffl master deserves most of the credit. @VijaySethuOffl @ilaiyaraaja @elredkumar @Udhaystalin @BhavaniSre @rsinfotainment @mani_rsinfo @VelrajR @DoneChannel1 @SonyMusicSouth pic.twitter.com/J6KD35RgEQ
— dr_vijaybalaji (@DrVijaybalaji) September 19, 2022