నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా చుట్టి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేకుండా పోయింది. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి దుష్ప్రచారం చేస్తుంటారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. ఏ రంగంలో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. సినిమా రంగం విషయానికొస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. సినిమా వాళ్ళు సున్నితంగా ఉంటారనో లేక ఎన్ని తిట్టినా తిరిగి ఒక మాట అనరనో కారణం ఏంటో తెలియదు గానీ.. సినిమా వాళ్ళ మీద సులువుగా రాళ్లు విసిరేస్తుంటారు. పండ్లు ఇచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు.. ఇండస్ట్రీలో మహా వృక్షం అయినటువంటి చిరంజీవి మీద కూడా అనేక మంది రాళ్లు విసిరారు.
మొగల్తూరు నుండి మెగాస్టార్ వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. ఇండస్ట్రీలో మెగాస్టార్ ఒక లెజెండ్. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సోలోగా, స్వయంకృషితో పైకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి మెగాస్టార్ రాజకీయాల్లోకి రాగానే తొక్కే ప్రయత్నం చేశారు కొంతమంది. అదే పనిగా విష ప్రచారం చేసి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకున్నారు. మొగల్తూరులో ఉన్న చిరంజీవి ఇంటిని లైబ్రరీ కోసం అడిగితే.. చిరంజీవి ఇవ్వకుండా 3 లక్షల కోసం అమ్మేసుకున్నారని.. ఇంకా అమ్మలేదా అని చిరు తన మేనేజర్ల మీద కోప్పడ్డారని, ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని అప్పటికప్పుడు అమ్మేసుకున్నారని బాగా దుష్ప్రచారం చేశారు. చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూశారు. ఈ దుష్ప్రచారం వల్ల చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీపై అత్యంత ప్రభావం చూపించింది.
ఇప్పటికీ ఈ విషయంలో చిరంజీవిని అర్థం చేసుకోకుండా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయం మీద స్పందించని చిరంజీవి.. మొదటిసారిగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జర్నలిస్ట్ ప్రభు అనేక అనుమానాలకు చిరంజీవి ద్వారా స్పష్టత ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే మొగల్తూరు ఇంటిని చిరంజీవి లైబ్రరీకి ఇవ్వకుండా 3 లక్షల కోసం అమ్మేసుకున్నారన్న అనుమాన భూతాన్ని చిరంజీవి ముందు ఉంచారు. దానికి చిరు మాట్లాడుతూ.. అసలు ఆ ఇల్లు తనది కాదని.. అది తన మేనమామ శ్రీనివాసరావు ఆస్తి అని అన్నారు. తన తల్లి తమ్ముడి ఇంటి మీద తనకు హక్కు ఎలా ఉంటుందని అన్నారు.
ఆ ఇంట్లో తన తల్లి ప్రసవించడం వల్ల తాను అక్కడ జన్మించానని.. అక్కడే చదువుకున్నానని.. అందువల్ల చిరంజీవి ఇల్లు అంటారని.. కానీ నిజానికి ఆ ఇల్లు తనది కాదని అన్నారు. తన మావయ్య ఆ ఇంటిని అమ్మేసుకుని వెళ్లిపోయారని అన్నారు. అయినా గ్రంథాలయాన్ని తాను ఈ ప్రస్తావన రాకముందే కట్టించానని అన్నారు. ఆల్రెడీ మొగల్తూరులో లైబ్రరీ ఉందని, అయినా కూడా తనది కాని ఇంటిని లైబ్రరీ కోసం ఇవ్వమని ఎందుకు అంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. 3 లక్షల కోసం ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి చిరంజీవికి ఎందుకు వస్తుంది? కోట్లాది రూపాయలకు అధిపతి అయినటువంటి చిరంజీవికి కలలో కూడా ఇలాంటి పరిస్థితి రాదని తెలిసినా కూడా దుష్ప్రచారం చేశారంటే అది వారి విజ్ఞతకే వదిలేయాలని చిరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇప్పటికైనా ఆ ఇల్లు చిరంజీవిది కాదని అర్థం చేసుకుంటారో లేదో. మరి ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే చిరంజీవిని తప్పుగా అర్థం చేసుకునే వారికి తెలిసేలా ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయ అంశం గురించి, చిరుపై జరిగిన విష ప్రయోగం గురించి.. ఇంకా అనేక ఆసక్తికర సంఘటనల గురించి చిరంజీవి సుమన్ టీవీతో పంచుకున్నారు. ఎక్స్ క్లూజివ్ ఫుల్ ఇంటర్వ్యూ కింద వీడియో ఉంది. చూడగలరు.