మెగాస్టార్ చిరంజీవి… క్లాస్ మాస్, స్టోరీ ఏదైనా సరే ఇచ్చిపడేస్తారు. అయితే రీఎంట్రీ తర్వాత అన్నీ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో వింటేజ్ చిరుని చూసే అవకాశం ‘వాల్తేరు వీరయ్య’తో తీరిపోయింది. కామెడీకి కామెడీ, యాక్షన్ కు యాక్షన్, డ్యాన్సులకు డ్యాన్సులు.. ఇలా ఒకటేమిటి అన్ని కుదిరేశాయి. దీనికి తోడు సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఆనందంలో ఉన్న చిరంజీవి.. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలానే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
ఇక విషయానికొస్తే.. ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కోసం అందరం కలిసి సమష్టిగా పనిచేశామని, సినిమా బ్లాక్ బస్టర్ అయి తీరుతుందనే నమ్మకంతో పనిచేశామని తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో చిరంజీవి చెప్పారు. ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని అన్నారు. మేం మాట్లాడటం ఆపేసి, ప్రేక్షకులు చెబితే వినాలని అనిపిస్తుందని చిరు చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల స్పందనే మా ఇంధనం అని చిరు అన్నారు. ఓ సినిమా అద్భుతంగా వస్తుందంటే.. దానికి కారణం ఆ సినిమాకు పనిచేసిన కార్మికులే అని చెప్పుకొచ్చాడు.
‘మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారిలో మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. దర్శకుడు బాబీ ఈ స్టోరీని అద్భుతంగా తీశాడు. అనుభవంతో ఏదైనా సూచిస్తే.. దాన్ని ఓ సవాలుగా తీసుకుని వర్క్ చేశాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి బాబీ సరిగా నిద్రపోలేదు. నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా సినిమాటోగ్రఫర్ విల్సన్ అన్నారు. ఎదురుగా ఉన్నది నా తమ్ముడని చెప్పాను. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ ప్రసాద్ పూనకాలు తెప్పించాడు’ అని చిరు చెప్పుకొచ్చారు.
ఇదే సక్సెస్ మీట్ లో మాట్లాడిన రవితేజ.. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని దాన్ని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియడం లేదంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. అన్నయ్య చిరుతో మరో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయాలని ఉందని రవితేజ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా మొత్తం మొదటి నుంచి చివరి వరకు గోలగోలగా ఉండాలని చిరు రిక్వెస్ట్ చేశాడు. దానికి ఆయన కూడా సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ పనిపై ఉండాలని ఉండాలన్నట్లుగా డైరెక్టర్ బాబీకి రవితేజ సూచించాడు. మరి చిరు-రవితేజ మల్టీస్టారర్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.