ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి, సీనియర్ హీరో సుమన్ కి మధ్య ఉన్న స్నేహం గురించి జనాలకు తెలియదు. బయట జనాలకు హీరోలంతా స్నేహంగా ఉంటారనే విషయం అందరికి తెలియకపోవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరు.. స్వయంగా హీరో సుమన్ ని వీడియో ద్వారా అభినందించడం హాట్ టాపిక్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సమయంలోనైనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బయట జనాలకు హీరోలంతా స్నేహంగా ఉంటారనే విషయం అందరికి తెలియకపోవచ్చు. కానీ.. వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అనేది సమయం వస్తేగాని తెలియదు. అలా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి, సీనియర్ హీరో సుమన్ కి మధ్య ఉన్న స్నేహం గురించి జనాలకు తెలియదు. కొన్నాళ్లపాటు వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ.. తాజాగా మెగాస్టార్ చిరు.. స్వయంగా హీరో సుమన్ ని వీడియో ద్వారా అభినందించడం హాట్ టాపిక్ గా మారింది.
అభినందించడం హాట్ టాపిక్ ఎలా అవుతుందని మీకు అనిపించవచ్చు.. కానీ, ఇప్పటికి చిరు – సుమన్ ల గురించి నెగిటివ్ రూమర్స్ ని స్ప్రెడ్ చేసినవారు ఉంటారుగా.. వారికోసమే. చిరంజీవి – సుమన్ మధ్య పాత గొడవలు, సినిమాల మధ్య క్లాష్, బేధాభిప్రాయాలు, మనస్పర్థలు ఇలా ఎన్నో పుకార్లు సృష్టించి ఇన్నాళ్లు రచ్చ చేశారు. కానీ.. వాళ్లందరికీ ఒకే ఒక్క వీడియోతో సమాధానం ఇచ్చారు చిరు. హీరో సుమన్.. ఇటీవలే ఇండస్ట్రీలో నటుడిగా 45 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకోవడంతో.. ఆయన్ని అభినందిస్తూ చిరంజీవి ఓ వీడియో సందేశం పంపించారు. అందులో సుమన్ గురించి ఎంతో ప్రేమగా.. వారి మధ్య అనుబంధం బోధపడేలా మాట్లాడారు చిరు.
ఈ సందర్భంగా నటుడు సుమన్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. “మై డియర్ సుమన్! మీరు ఫిలిం ఇండస్ట్రీలో 45 ఏళ్ళ కెరీర్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 10 భాషలలో 150కి పైగా సినిమాలు చేయడం అద్భుతమైన విషయం. అది ఖచ్చితంగా గొప్ప అచీవ్ మెంట్. 45 ఏళ్ళ మీ సినీ ప్రయాణం.. మీ కమిట్మెంట్, డెడికేషన్ కి నిదర్శనం. ఇంత గొప్ప అచీవ్ మెంట్ సాధించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు. మీరు ఇలాగే మరెన్నో ఏళ్ళు ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయాలనీ.. విష్ చేస్తున్నాను. ఫిబ్రవరి 16న మంగళూరులో మీ 45 ఏళ్ళ కెరీర్ ని పురస్కరించుకొని ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్” అని విష్ చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరు విష్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. నటుడు, హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన.. హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా భాషలలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో 1982 నుండి 1998 వరకు స్టార్డమ్ ని చూశారు. ముఖ్యంగా నేటి భారతం, బావ బావమరిది, సితార, అన్నమయ్య, పెద్దింటి అల్లుడు, కొండపల్లిరాజా, దేవుళ్ళు, న్యాయం మీరే చెప్పాలి లాంటి ఎన్నో సూపర్ హిట్స్ చేశారు. ఆ తర్వాత విలన్ గా శివాజీ సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అక్కడినుండి డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. మరి హీరో సుమన్ గురించి చిరు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.