బలగం సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విజయంతో ఎందరో కొత్త వారు వెలుగులోకి వచ్చారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే బలగం మొగిలయ్య. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి.. మొగిలయ్యకు సాయం చేశారు. ఆ వివరాలు..
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో స్టార్ హీరో మాత్రమే కాదు.. అంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. హీరోగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోవడం మాత్రమే కాక.. తన వంతుగా సమాజానికి సేవ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్లు కష్టాల్లో ఉన్నారు, అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త ఆయనకు తెలిస్తే.. చాలు వెంటనే స్పందిస్తారు. వారిని ఆదుకుంటారు. కొన్ని రోజుల క్రితం తమిళ నటుడు పొన్నాంబలం కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే వైద్యాన్ని అపోలో వైద్య సంస్థల ద్వారా ఉచితంగా అందించి ఆదుకున్నారు చిరంజీవి. ఇక తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు చిరంజీవి. బలగం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి.. మొగిలయ్యను ఆదుకునేందుకు మందుకు వచ్చారు. ఆ వివరాలు..
తాజాగా చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయం సాధించిన బలగం చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చకున్నాడు మొగిలయ్య. ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సాంగ్ తోడుగా మా తోడుండి పాట.. ప్రతి ఒక్కరిని కదిలించింది. సినిమాకు కీలకంగా నిలిచిన ఆ పాట పాడింది మొగిలయ్య దంపతులు. అయితే ఆయన ప్రసుత్తం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కిడ్నీలు దెబ్బ తినడం, డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు రావడంతో.. ఆయన కంటి చూపు కూడా మందగించింది. వీటికి తోడు ఇటీవలే మొగిలయ్యకు గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కాగా మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు కూడా మందగించింది. ఇక మొగిలయ్య అనారోగ్య విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా చికిత్స అందించేందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలో బలగం డైరెక్టర్ వేణుకి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు చికిత్స కోసం ఎంత ఖర్చైనా సరే తానే భరిస్తానని తెలిపారు. మొగిలయ్యకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిం సాయం చేస్తున్న విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా మెగాస్టార్ సాయం విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బలగం సింగర్ మొగిలయ్యకు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు అండగా నిలుస్తున్నారు. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మొగిలయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మొగిలయ్యను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మొగిలయ్యను ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ ఆయనను ప్రశంసిస్తున్నారు. మరి చిరు సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Annayya #Chiranjeevi Personal call to @VenuYeldandi9 about Balagam Mogilaiah Eyes surgery@KChiruTweets said He will help financially for Mogailaiah Surgery#MegastarChiranjeevi pic.twitter.com/t2mwHTuyf1
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 17, 2023