ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అంతా సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా కొత్తకొత్త ఫోటోషూట్స్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ప్రస్తుతం తన గ్లామర్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే తన గ్లామర్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వెనకేసుకుంది. అందులోనూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి వరుసగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో మాస్ రాజా రవితేజతో కలిసి ఓ ఐటమ్ సాంగ్ లో కూడా నర్తించింది. ఆ పాట ఏ స్థాయిలో కుర్రకారును ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అర్థమైందా..? ఆ బ్యూటీ ఎవరో కాదు.. అప్సర రాణి.ఇటీవల ఆర్జీవీ పరిచయం చేసిన హీరోయిన్స్ లో ఠక్కున గుర్తొచ్చే పేరు అప్సరదే. గ్లామర్ షోకి ఏమాత్రం వెనకాడకుండా పోటీపడి మరీ సినిమాల్లో బయటపెడుతోంది. ఈ భామకు మంచి సినిమా లైఫ్ తో పాటు ఫేమ్, నేమ్ అందించింది కూడా వర్మనే అంటున్నాయి సినీవర్గాలు. అదీగాక వర్మతో ఇటీవలే ‘డేంజరస్’ సినిమా చేసింది. ఆ సినిమా వివాదాల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడింది. మరి వర్మ హీరోయిన్ అంటే మినిమమ్ షో ఉంటుందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తుంటారు. మరి అప్సర రాణి అందాల షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.