కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్యలకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. “వేలైయిల్లా పట్టాదారి” అనే సినిమా విషయంలో వారిద్దరి పై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో వారిద్దరూ కోర్టులో నేరుగా హాజరు కావాలని సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను తాజాగా మద్రాసు హైకోర్టు నిలుపుదల చేసింది. ధనుష్ హీరోగా “వేలైయిల్లా పట్టాదారి” అనే చిత్రాన్ని “వండర్‌బాయ్స్” తమ సొంత నిర్మాణ సంస్థ బ్యానరులో నిర్మించారు. దీని డైరెక్టర్లుగా ధనుష్, ఐశ్వర్యలు ఉన్నారు. అయితే, ఈ సినిమాలోని పొగత్రాగే సన్నివేశాలు ఉండగా, ఇవి తెరపై కనిపించే సమయంలో “పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం” అనే హెచ్చరిక ప్రకటన వేయలేదు.
దీంతో తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ కంట్రోల్ డైరెక్టర్ డా.వి.కె.పలని సైదాపేట 18వ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. ఈక్రమంలో జూలై 15వ తేదీన కోర్టులోకు హాజరు కావాలని ధనుష్, ఐశ్వర్యలను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ధనుష్, ఐశ్వర్యలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. ధనుష్, ఐశ్వర్యలకు ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీచేసింది. క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే, ఈ కేసులో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేలా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Salman Khan: బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్ రూ. 1000 కోట్ల డిమాండ్! అంత సీన్ ఉందా?
ఇదీ చదవండి: Indraja: తన లవ్ మ్యారేజ్ గురించి నటి ఇంద్రజ చెప్పిన నిజాలు!
ఇదీ చదవండి: Salman Khan: సల్మాన్ హత్యకు కుట్ర! పోలీసుల విచారణలో నిందితుడు బయటపెట్టిన నిజాలు!