సినీ ఇండస్ట్రీలోకి ఎక్కువగా మోడలింగ్ నుంచి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చి పలు యాడ్స్ లో నటించిన వారు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మరికొంత మంది షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న చాందినీ చౌదరి ‘కేటుగాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. తర్వాత కలర్ ఫోటో చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల సైబర్ నేరగాళ్లు ఏ విధంగా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొంతమంది కేటుగాళ్ళు సెలబ్రెటీ సోషల్ ఐడీలను హ్యాక్ చేస్తూ ఇబ్బందులకు గురిచి చేసిన ఘటననలు ఎన్నో ఉన్నాయి. మరికొంత మంది ప్రముఖుల ఫోటోలు ఉపయోగించిన వాట్సాప్ చాట్స్ తో డబ్బులు వసూళ్లు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా నటి చాందినీ చౌదరి నెటిజన్లకు అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా నటి చాందినీ చౌదరి నెటిజన్లకు అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తన ఫోటోలు, పేరు పెట్టి కొంతమంది మోసాలకు పాల్పపడుతున్నారని.. అలాంటి మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
తన పేరు తో కొంత మంది చీటింగ్ చేస్తున్నారని.. వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు తన ఫోటోతో పాటు సహ నటీనటుల ఫోటోలు వాట్సాప్ లో వాడుకుంటూ మోసాలకు పాల్పపడుతున్నారని.. సమాచారం తెలుసుకొని వారిని వేధిస్తున్నారని.. అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి స్కామ్ చేసే వారి విషయం బయట పెట్టాలని నెటిజన్లను హెచ్చరించింది. మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేయాలని.. అలాగే మీకు సంబంధించిన ఎలాంటి వివరాలు వాళ్లకు తెలపవొద్దని చాందిని చౌదరి సూచించారు.