రెండు రోజుల క్రితం చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం..
ప్రముఖ కమెడియన్ చలాకీ చంటి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో సమస్య ఉండటంతో స్టంట్లు వేసినట్లు సమాచారం. తీవ్ర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన వేగంగా కోలుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అతి త్వరలో ఇంటికి పంపనున్నారట. కాగా, చలాకీ చంటి పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. 2013లో మొదలైన జబర్థస్త్ కామెడీ షోతో తెలుగు నాట మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
అనారోగ్యం కారణంగా టీవీ షోలు, సినిమాలకు దూరం అయ్యారు. ఈ నెల 21 ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు. చంటి అనారోగ్యం విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షోలు, సినిమాలు చేయాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితుల ప్రార్థనలు ఫలించాయి. చంటి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ఆయన త్వరలో క్షేమంగా ఇంటికి వెళ్లనున్నారు. మరి, చలాకీ చంటి తాజా హెల్త్ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.