సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో తెలుగు వారియర్స్ మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. భోజ్‌పురి దబాంగ్ తో జరిగిన ఫైనల్ పోరులో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు వారియర్స్ సారథి అక్కినేని అఖిల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 67 పరుగులు) ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
‘8 జట్లు.. 19 మ్యాచులు..’ 36 రోజుల పాటు అభిమానులకు వినోదాన్ని పంచిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో తెలుగు వారియర్స్ మరోసారి విజేతగా అవతరించింది. శనివారం విశాఖపట్నంలోని ACA-VDCA వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్.. భోజ్‌పురి దబాంగ్స్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచులలాగే ఈ మ్యాచులోనూ తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్(32 బంతుల్లో 67 పరుగులు) సునామీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
తొలుత టాస్ గెలిచి తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్.. అఖిల్(32 బంతుల్లో 67 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ తో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో వారియర్స్ కు 37 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దబాంగ్స్ 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 58 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యాన్ని తెలుగు వారియర్స్ కేవలం వికెట్ నష్టపోయి ఛేదించింది. చివరలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బౌండరీ కొట్టి జట్లకు విజయాన్ని అందించాడు. తెలుగు వారియర్స్‌కి ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు 2015, 2016, 2017లో వరుసగా గెలిచి తెలుగు వారియర్స్ హ్యట్రిక్ టైటిల్స్ సాధించింది.
•Champions of CCL 2015.
•Champions of CCL 2016.
•Champions of CCL 2017.
•Champions of CCL 2023.Telugu Warriors – 4th times won CCL trophy, most successful team in the history. pic.twitter.com/UJGEO3b7Jb
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2023
Eyyyy…. Eyyy…. 😂😂@AkhilAkkineni8 & @MusicThaman #CCL2023 #TeluguWarriors #celebritycricketleague #AkhilAkkineni #Thaman #AGENT pic.twitter.com/j97IemhNVS
— నాగరాజు పాండే😎 (@Mahesh_4Akhil) March 26, 2023