సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో తెలుగు వారియర్స్ మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. భోజ్‌పురి దబాంగ్ తో జరిగిన ఫైనల్ పోరులో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు వారియర్స్ సారథి అక్కినేని అఖిల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 67 పరుగులు) ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. చివరిదశకు వచ్చేసింది. సెమీస్ లో అద్భుతమైన విజయం సాధించిన తెలుగు వారియర్స్.. కప్ కోసం భోజ్ పురి జట్టుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయింది.
పంజాబ్ దే షేర్ తో జరుగుతున్న మ్యాచులో తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెలరేగి ఆడారు. క్రీజులోకి వచ్చీరాగానే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన థమన్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభినులను ఉత్సాహ పరిచాడు.
ఒకరేమో క్రికెట్ లో తోపు. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ ఇప్పుడు కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అఖిల్ అక్కినేని బ్యాట్ పట్టుకుంటే విధ్వంసమే. సిక్సులు, ఫోర్లతో బంతికి ఊపిరి సలపనివ్వకుండా చేస్తాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లా అఖిల్ బ్యాటింగ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇండియాలో రెండు రంగాలకు బాగా క్రేజ్ ఉంటుంది. అంది సినిమా, రెండు క్రీడా రంగం. క్రీడా రంగంలోనూ ముఖ్యంగా క్రికెట్ అంటే భారతీయులు పడిచచ్చిపోతారే భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అంది వాస్తవమే.. క్రికెట్‌ను మన దేశంలో ఒక మతంలా భావిస్తారు. ఇక సినిమా అన్నా.. సినిమా హీరోల్లన్న యువతలో విపరీతమైన క్రేజ్. ఇండియన్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రెండు ఊపేస్తాయి. ఓ సారి క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోయే ఇండియా.. మరోసారి మంచి సినిమా వచ్చినప్పుడు ఆ […]