ఈ మధ్య కాలంలో సీరియల్, షోల ప్రమోషన్ కోసం.. అందులో నటించే వారి మధ్య.. లవ్ ట్రాక్ చూపించడం.. వారి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని జనాలను నమ్మించడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ జాబితాలో ప్రదానంగా చెప్పుకోవాల్సింది రష్మీ-సుధీర్, వర్ష-ఇమ్మాన్యుయేల్. వీరి మధ్య వాస్తవంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆయా షోల నిర్వాహకులు.. రేటింగ్ కోసం వీరిని లవర్స్ లా చూపించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సీరియల్స్ విషయానికి వస్తే.. నటడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ-నవ్య స్వామి కూడా ఇలాంటి లవ్ ట్రాక్ తో ఫేమస్ అయ్యారు. వీరద్దరి మధ్య కెమిస్ట్రీ, క్లోజ్ రిలేషన్ చూసి.. నిజంగానే లవ్ లో ఉన్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. తాజాగా వీరిద్దరి లవ్ మ్యాటర్ మరో సారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ షో కోసం ఈ వారం రీల్ కపుల్ నవ్య స్వామి-రవి కృష్ణ జోడీతో పాటు రియల్ కపుల్ సిద్ధార్థ్-విష్ణుప్రియ జంటగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా చివర్లో నవ్య స్వామి-రవి కృష్ణ బ్రేకప్ సీన్ చూపించి మరింత ఆసక్తి పెంచారు. దీనిలో నవ్య స్వామి, రవి కృష్ణ దగ్గరకు వచ్చి.. ఇంట్లో వాళ్లు ఒప్పకోవడం లేదని.. తాను ప్రయత్నించినా ఫలితం లేదని.. తల్లిదండ్రులను బాధ పెట్టలేను అంటూ రవి కృష్ణకి బ్రేకప్ చెప్తుంది. అందుకు అతడు అంత ఈజీగా ఎలా చెప్తున్నావ్ అని ప్రశ్నించగా.. నాకు ఈజీగా ఏం లేదు.. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. కానీ విడిపోక తప్పడం లేదంటూ బాధ పడుతుంది. వీరిద్దరిని చూసి సుమ కూడా బాధ పడుతుంది.
కాగా రవికృష్ణతో లవ్ ట్రాక్ విషయమై బోలెడన్ని వార్తలు రావడంతో గతంలోనే దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది నవ్య స్వామి. తమ మధ్య 100% ఫ్రెండ్‌షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.