విరూపాక్ష సినిమాలో నటుడు రవి కృష్ణ ఎమోషనల్ అయ్యాడు. ఈ సమయంలో కంటిలోనుంచి నీరు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే...
సినిమా హిట్ అయితే సక్సెస్ సెలెబ్రేషన్ మామూలే. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు, హీరో, హీరోయిన్లు స్పీచ్ ఇస్తూ సంతోషం వ్యక్తం చేస్తారు. సినిమా హిట్ అయితే వారు పడిన కష్టం మొత్తం మర్చిపోయి ఇలా స్టేజ్ మీద ఎమోషనల్ అవ్వడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. అయితే విరూపాక్ష సినిమా సక్సెస్ మీట్ లో రవి కృష్ణ ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మరి ఈ బుల్లి తెర నటుడు ఎందుకు అంతలా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సీరియల్ యాక్టర్ రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎప్పుడూ కనిపించకపోయినా.. బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టి హౌస్ లో ప్రేక్షకుల హృదయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సీరియల్స్, ప్రోగ్రామ్స్ , డ్యాన్స్ కాంపిటీషన్ అంటూ బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే విరూపాక్ష సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. సాయి ధరమ్ తేజ్, సంయక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఇటీవలే రిలీజై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఎక్కడ చూసిన పాజిటీవ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా.. రవి కృష్ణ కాస్త ఎమోషనల్ అయిపోయాడు. ఆనందంలో తడబడుతూ మాట్లాడాడు. ఈ సమయంలో కంటిలోనుంచి నీరు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే.. ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ కి మంచి స్పందన రావడమే అని తెలుస్తుంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ విరూపాక్ష సినిమాలో రవి కృష్ణ నటన అందరిని మెప్పించింది. తొలి ప్రయత్నంలోనే తన పాత్రకు ప్రశంసలు దక్కడంతో సంతోషంలో ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకులు మంచి సినిమాలు తీస్తే ఆదరిస్తారు. “నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ కి ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు. మరి రవి కృష్ణ ఇంతలా ఎమోషనల్ అవ్వడానికి సినిమాలో ఏ పాత్ర చేసి ఉంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.