రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమార్జన పెరిగిపోతుందని.. దొంగనోట్ల చెలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
దేశంలో నకిలీ నోట్ల చెలామని వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్థిక వేత్తలే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ లోని యోజనా భవన్ సెల్లార్ లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెల్లార్ లోని తాళం వేసిన ఉన్న ఓ అల్మారాలో నగదు, బంగారం బయటపడింది. యోజనా భవన్ రాష్ట్ర ఐటీ విభాగంతో, జన్ ఆధార్ తో పాటు ఇతర కార్యాలయాలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ లోని బేస్ మెంట్ లోని కొన్ని అల్మారాలు ఉన్నాయి.. వాటిని కొన్ని నెలలుగా సిబ్బంది వాడటం లేదు. శుక్రవారం అవసరం నిమిత్తం ఈ అల్మారాలను తెరువగా అందులో ఓ ట్రాలీ సూట్కెస్ అనుమానాస్పదంగా కనిపించింది. సిబ్బంది దాన్ని తెరిచి చూడగా డబ్బు, బంగారం ఉన్నాయి.
అల్మారాలో దొరికిన సూట్కేస్ లో బంగారం, డబ్బు ఉందన్న విషయం తెలుసుకున్న డైరెక్టర్ మహేష్ గుప్తా పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు సూట్ కేసులో రూ.2వేలు, రూ.500 నోట్లు ఉన్నాయని.. వాటి విలువ రూ.2.31 కోట్లు అని.. దానితో పాటు కిలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ బిల్డింగ్ లోని బేస్ మెంట్ లో ఎక్కువగా ఆధార్ విభాగానికి చెందిన సిబ్బంది ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో పోటీసులు ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సీసీ టీవి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ డబ్బు, బంగారం ఎవరిది? ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం త్వరలో బయటపెడతామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇంతపెద్ద ఎత్తున డబ్బు, బంగారం బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
#WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023