యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్పాంటేనియస్ పంచులతో, గల గల మాట్లాడుతూ.. షోని రక్తి కట్టిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు ఎంత మంది యాంకర్లు వచ్చినా.. సుమతో పోటీ పడలేకపోతున్నారనేది వాస్తవం. ప్రస్తుతం సుమ ఈటీవీలో క్యాష్ ప్రోగ్రాంకి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. ప్రతి వారం నలుగురు గెస్ట్‌లను పిలిచి.. వారి చేత గేమ్‌లు ఆడిస్తూ.. మధ్య మధ్య తన పంచులతో వచ్చిన గెస్ట్‌ల చేత కామెడీ చేయిస్తూ.. షోని రక్తి కట్టిస్తుంది. ఈ క్రమంలో వచ్చే శనివారం అనగా.. ఏప్రిల్ 23న ప్రసారం కాబోయే క్యాష్ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా స్పృహ తప్పిన మంత్రి… ఐసీయూలో చికిత్స!
ఈ వారం క్యాష్ షోలో భాగంగా రచ్చ రవి, భద్రం, తాగుబోతు రమేష్, ఖుయ్యుమ్ లను గెస్ట్‌గా పిలిచింది. ఎప్పటిలాగానే క్యాష్ షో మొత్తం ఎంతో సందడి సందడి గానే సాగిపోయింది అని చెప్పాలి. ఇక ప్రోమో చివరిలో సుమ రచ్చ రవి మధ్య ఒక వివాదం చోటుచేసుకుంది. ఎన్నిసార్లు క్యాష్ షో కి పిలిచావ్ ఒక్కసారైనా నన్ను గెలిపించవా అంటూ అడుగుతాడు రవి. అంటే ఇప్పుడు నేను నిన్ను రెకమెండ్ చేయాలా అంటుంది సుమ. అందుకు రచ్చ రవి.. ఎంమందికి ఇప్పటివరకు ఆన్సర్లు చెప్పలేదు నువ్వు అంటాడు. ఆన్సర్ చెప్పడం ఏంటి పిచ్చి పిచ్చి గా మాట్లాడకు అంటుంది సుమ. రచ్చ రవి ఏదో లోలోపల అనుకుంటూ బూతులు మాట్లాడుతాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే అస్సలు బాగుండదు ఎందుకు పిలుస్తారు ఇలాంటి స్టుపిడ్స్, ఇడియట్స్ ను అంటూ తన చేతిలో ఉన్న కార్డు నేలకేసి కొడుతుంది. తర్వాత ఒక బూతు తిట్టబోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.