ఎంటర్టైన్ మెంట్ అందించే టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ షో ఒకటి. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. ముఖ్యంగా వారవారం కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడి చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ షో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొని సందడి చేశారు. చూస్తుంటే ప్రోమో అంతా చాలా హుషారుగా ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ వినోదం పండించారు.
అంతేగాక యాంకర్ సుమ ఒక్కొక్కరికి ఒక్కో పనిష్మెంట్స్ ఇస్తూ కంటెంట్ రాబట్టింది. అయితే.. అంతా బాగానే ఉందిగానీ.. ప్రోమో చివరికి వచ్చేసరికి యాంకర్ సుమకి ఓ యంగ్ కుర్రాడు లవ్ ప్రపోజ్ చేయడం హైలైట్ గా నిలిచింది. కమెడియన్ ప్రవీణ్ డైరెక్షన్ చేస్తూ.. పార్క్ లో అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలని ఆడియెన్స్ లో నుండి ఓ అబ్బాయిని పిలిచి.. ఆ అబ్బాయికి ఓ గులాబీ ఇచ్చాడు. కట్ చేస్తే.. ఆ అమ్మాయి స్థానంలో యాంకర్ సుమ నిలబడి ఉంది. ఆ అబ్బాయి వెళ్లి.. సుమ ఐ లవ్ యూ.. అని చెప్పగానే, నువ్వు మా అబ్బాయి క్లాస్ మేట్ కదా అని సెటైర్ వేసింది. ప్రస్తుతం సుమకి లవ్ ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.