బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాను.. దక్షిణాది అన్ని భాషలలో దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా అంచనాలు పెంచేసిన బ్రహ్మాస్త్ర మూవీని తెలుగులో ‘బ్రహ్మాస్త్రం‘ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
ఇక అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనిరాయ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. అయితే.. బ్రహ్మాస్త్ర రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో భాగంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 2న(నేడు) సాయంత్రం జరగాల్సిన ఈ గ్రాండ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ.. ఈ ఈవెంట్ కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజాగా రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయినట్లు తెలుస్తుంది. మరి ఎందుకు క్యాన్సల్ అయ్యిందనే వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీస్ శాఖ నుండి పర్మిషన్ ఇంకా రాలేదనే కారణాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్రబృందం కూడా అధికారికంగా అప్ డేట్ ఇవ్వడం జరిగింది. అయితే.. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు ఓ రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకపోయినా కనీసం ప్రెస్ మీట్ అయినా జరపాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నారు. పార్క్ హయాత్ లో రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ ప్రెస్ మీట్ లో బ్రహ్మాస్త్ర బృందంతో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారని వినికిడి. ఇక బ్రహ్మాస్త్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరపనుందా లేక ఈ ప్రెస్ మీట్ తోనే సరిపెట్టనుందా? అనేది తెలియాల్సి ఉంది. మరి బ్రహ్మాస్త్ర మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Brahmastra event cancelled. A press meet will be held at Park Hyatt, Hyderabad at 8 PM. Tarak along with the entire movie team apart from the director attending the press meet. pic.twitter.com/Ur5P895Bf7
— Aakashavaani (@TheAakashavaani) September 2, 2022
#Brahmastra Press Conference at Park Hyatt.
NTR @tarak9999 as chief guest.
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) September 2, 2022