దేశంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతుంతో దాంతో పాటు సైబర్ దోపిడీలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ వాడుతూ ఉన్నచోటి నుంచే డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈతరహా చోరీల వల్ల సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్ళు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ ద్వారా దుండగులు మూడు లక్షలకు పైగా దోచుకున్నట్లు సమాచారం. తనకు సంబంధించిన వారు ఎవరూ తన కార్డు అడగలేదని.. తన కార్డు వివరాలు ఎవరికీ చెప్పలేదని అన్నారు బోనికపూర్. తన కార్డు ద్వారా జరిగిన లావాదేవీలు తనకు తెలియకుండా జరిగాయని అయన వాపోయారు. తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. తన అకౌంట్స్ కి సంబంధించిన లావాదేవీలు గురుగ్రామ్ లో గల ఒక కంపెనీకి వెళ్లినట్లు తెలిసింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.