ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కుదిపేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిచెందిన వార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కుదిపేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిచెందిన వార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. మాధురి దీక్షిత్ మాతృమూర్తి స్నేహలత దీక్షిత్ మరణించారు. తల్లి మరణంతో మాధురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. స్నేహలత దీక్షిత్ ముంబైలోని స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది.
ఇక తల్లి అంత్యక్రియలను వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే వెల్లడించారు. అయితే.. స్నేహలత మృతికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. స్నేహలత దీక్షిత్.. మార్చి 12న ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 91 ఏళ్ళు. ఎల్లప్పుడూ ఎంతో, ప్రేమగా సన్నిహితంగా ఉండే తల్లి దూరమయ్యేసరికి మాధురి.. తల్లి ఇక తిరిగిరాదనే విషయాన్నీ జీర్ణించుకోలేకపోతోంది. గతేడాది జూన్ లో మాధురి తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. ఇంతలోనే ఇలా జరిగేసరికి.. స్నేహలత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సినీ ప్రముఖులు, నెటిజన్స్, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Sad news as Madhuri Dixit lost her mom this morning. Madhuri and her husband Shriram Nene said, “Our beloved Aai, Snehalata, passed away peacefully this morning surrounded by her loved ones.”
Condolences to the family 🙏 May she rest in peace. #madhuridixit #shriramnene #news pic.twitter.com/pLrVpF3RKb— Pinkvilla (@pinkvilla) March 12, 2023
RIP Snehlata Dixit 🥹
I can understand how your family might be feeling and i can’t imagine how broken my love MD would be 🥹🥹. )
But You all have to stay strong @MadhuriDixit .
You were the strongest pillar of family and no one can fill your place 🥺#MadhuriDixit #rip pic.twitter.com/oyg3cKdZF5— Madhuri.creationss_ (@MadhurisHamna) March 12, 2023