తెలుగు ఇంస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్. హీరోగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ.. నిర్మాతగా దేనికైనా సిద్దంగా ఉంటారు. ఈ క్రమంలో కొత్త డైరెక్టర్ అయిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ‘బింబిసార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.
కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో ‘బింబిసార’ సినిమాని తెరకెక్కించారు. ఇక బింబిసారుడు స్క్రిప్ట్ పై 2019 నుంచి పని చేస్తూ వచ్చారు. ఈ సారి తన కెరీర్లోనే బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పటాస్ సినిమా కలెక్షన్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా బడ్జెట్ను పెట్టి సినిమా చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్తో ‘బింబిసార’ తెరకెక్కింది.
ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బింబిసార’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ.6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిన్న ఆదివారం కావడంతో కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా29.8 కోట్ల రూపాయల గ్రాస్, 18.1 కోట్ల షేర్ సాధించింది. అయితే కల్యాణ్ రామ్ బింబిసార కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. మూడో రోజు ప్రాంతాల వారీగా బింబిసార సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.