బుల్లితెరపై ప్రసారం అయ్యే అన్ని రియాలిటీ షోలతో పోలిస్తే.. బిగ్ బాస్ కు క్రేజ్, ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. త్వరలోనే బిగ్ బాస్.. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్ ఆఖరు రోజున స్వయంగా నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓటీటీ బిగ్ బాస్ కు కూడా నాగార్జుననే హోస్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ లిస్ట్ లో యాంకర్ వర్షిణి, మరో యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్-6 హోస్ట్ గా బాలయ్య? నాగార్జున సైడవుతున్నాడా?వీరితో పాటు సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, ఢీ-10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేం వైష్ణవి, యాంకర్ ప్రత్యూషల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్‌బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక బిగ్‌బాస్ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ ప్రొడక్షన్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హోస్ట్ గా రామ్ చరణ్! ఇక నుండి ఓటీటీలో!