బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా, బిగ్ బాస్ కార్యక్రమానికి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇందులో భాగంగానే బిగ్ బాస్-5 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్-5 మొదలు కాబోతుంది. ఇక ఇప్పటికే షోకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-5 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. యాంకర్ రవి, సిరి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, షణ్ముఖ్, టివి 9 యాంకర్ ప్రత్యూష, పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్-5 కోసం ఓ సూపర్ కంటెస్టెంట్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానెల్ సరయు.
యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి సరయు గురించి పరిచయం అవసరం లేదు. కాస్త అడల్ట్ కంటెంట్ తో, అడల్ట్ పంచ్ లతో సరయు టీమ్ యూట్యూబ్ లో చేసే రచ్చ అంతాఇంత కాదు. వీరు ఏ వీడియో విడుదల చేసిన కొన్ని లక్షల్లో రీచ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సరయు తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో ఈ అడల్ట్ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం 7 ఆర్ట్స్ సరయు గనుక బిగ్ బాస్-5 లో అడుగు పెడితే ఆమెకి కుర్రకారు కనెక్ట్ అయిపోవడం ఖాయం.
మరి, సరయు బిగ్ బాస్-5 లో విన్నర్ గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.