సినిమా తారలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు, కార్లు కొన్నారంటే.. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం బుల్లితెర నటులు కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. ఖరీదైన కార్లు, ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ 5 బ్యూటీ లహరి శెరి కూడా చేరింది. కోటి రూపాయల విలువ చేసే కారు కొన్ని వార్తల్లో నిలిచింది.
లహరి శెరి… ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బిగ్ బాస్’ సీజన్ 5 రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా చాలా మందికి తెలిశారు. అంతకు ముందు, తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. బిగ్ బాస్ 5 తర్వాత ప్రస్తుతం బీబీ మహోత్సవం షూటింగ్ లతో బిజీగా ఉంది లహరి శెరి. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా వోల్వో ఎక్స్‌సి60 కారు కొన్నది లహరి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కారు ఖరీదు కోటి రూపాయలు. విషయం తెలిసిన అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
లహరి శెరి దగ్గర ఖరీదైన బైక్స్ కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ బైక్ కొన్నట్టు గతంలో ఆమె తెలిపారు. బిగ్ బాస్ బ్యూటీ ఇలా వరుస పెట్టి.. ఖరీదైన కారు, బైక్ కొనుగోలు చేయడం విశేషం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.